ఘనంగా సన్మానించిన లైన్ సభ్యులు
ద్రోణ బోధన్ ప్రతినిధి
నిజామాబాద్ జిల్లా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ప్రదీప్ గుప్తా ఎన్నికయ్యారు. బోధన్ లైన్స్ ప్రతినిధులు గుప్తా సేటును ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ ఎన్నికలలో నిర్వహించారు. ప్రధాన కార్యదర్శిగా పూర్ణ ప్రసాద్ కోశాధికారిగా విజయ్ కుమార్ స్వామి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వేరే పదవి కాలం రెండేళ్ల పాటు ఉండనున్నట్లు తెలిపారు. బోధన్ ప్రాంతానికి చెందిన ప్రదీప్ గుప్తా ప్రతినిత్యం ప్రజలతో మమేకమై తమ వ్యాపార లావాదేవీలతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టడం ఎంతో అభినందనీయమని లైన్ అధ్యక్షులు బసవేశ్వర అన్నారు. బోధన్ పట్టణానికి చెందిన వ్యక్తి ఎన్నిక కావడం బోధన్ ప్రజలకు ఎంతో గర్వంగా ఉందన్నారు. పెట్రోలియం డీలర్స్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ వారు ఇబ్బందుల్లో తాను అండగా ఉంటానని ప్రదీప్ గుప్తా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇందూర్ పాఠశాల కరస్పాండెంట్, లైన్ ప్రతినిధి కొనాలి కిషోర్, వెంకటేశ్వరరావు, విద్యా వికాస్ కళాశాల వ్యవస్థాపకులు లైన్ ప్రతినిధి యార్లగడ్డ శ్రీనివాసరావు, శ్రీధర్ మరియు లైన్ ప్రతినిధి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


