Thursday, February 12, 2026

మన మతం తో పాటు ఇతర మతాలను కాపాడుదాం

బోధన్ జులై 24, ద్రోణ

భారతదేశం సర్వ మతాలకు మహోన్నత స్థానం కల్పించిన రాజ్యాంగం, మన మతంతో పాటు ఇతర మతాలను గౌరవించడం మన మానవత్వం ఉందని శాసనసభ్యులు శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.వర్ని మండలం సత్యనారాయణపురం లో 10 లక్షల వ్యయంతో నిర్మించిన సి ఎస్ ఐ చర్చినీ శుక్రవారం పోచారం ప్రారంభించారు.
ఈసందర్భంగా పోచారం మాట్లాడుతూ భారతదేశం భిన్న మతాల, కులాల సమూహం,మన ఆచారాలను గౌరవిస్తూ, ఇతరుల ఆచారాలను కూడా గౌరవించడం మానవత్వం.
సమాజానికి శాంతి, ప్రేమను ప్రభోదించిన శాంతి దూత ధైవకుమారుడు యేసు క్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకాలు అని పోచారం అన్నారు.ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా శాంతి, సామరస్యాలను పాటిస్తూ సమస్త మానవాళికి సుఖ, శాంతులను అందించాలని ఏసు క్రీస్తు ప్రభువును కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular