మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి
బోధన్ జులై 27 ద్రోణ
ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని, సమాజంలో ఉపాధ్యాయులకు ఎంతో గౌరవం ఉందని, ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు తమ పవిత్రతను కాపాడుకోవడంతోపాటు సమాజానికి మార్గ నిర్దేశకులుగా నిలవాలని మాజీ మంత్రి బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. సాలూర గ్రామానికి చెందిన, పి ఆర్ టి యు రాష్ట్ర డెలికేట్ అధ్యక్షులు, నిజామాబాద్ జిల్లా ఉపాద్య సంఘం మాజీ అధ్యక్షులు శంకర్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మాజీ మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నీలా పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులకు పని చేస్తున్న ఇల్తెపు ముందస్తు ఉద్యోగ విరమణ పొందారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయ సంఘం నాయకులు హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా హాజరైన మాజీమంత్రి జ్యోతి ప్రజల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందస్తు ఉద్యోగ విరమణ పొందుతున్న శంకర్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని సమాజానికి దిశా నిర్దేశం సూచించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పదవి విరమణ ప్రభుత్వ ఉద్యోగంలో సర్వసాధారణమని అన్నారు. పదవీ విరమణ గడువు ముగియకముందే శంకర్ పదవి విరమణ చేశారన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ ఉపాధ్యాయ సమస్యలతో పాటు, సమాజ సేవ కూడా చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులపై మరింత శ్రద్ధ పెంచి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని సూచించారు. ఇప్పటికే మా ప్రభుత్వం ప్రభుత్వ విద్యను ఎంతో మెరుగుపరిచిందన్నారు. ప్రభుత్వం విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ సక్తులు చూపుతోందన్నారు. ప్రభుత్వ సర్వతో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుత ఏడాది గణనీయంగా విద్యార్థుల సంఖ్య పెరిగింది అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయులపై ఎంతో బాధ్యత ఉందన్నారు.
ఇల్తెపు శంకర్ సేవలు అభినందనీయం
ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ శంకర్ సమాజ సేవలో ఎంతో చేశారని, ఉపాధ్యాయ సంఘం పెద్దలు, రాజకీయ నాయకులు, బోధన్ నియోజకవర్గంలోని పలు గ్రామాలు చెందిన ఎంతో మంది మేధావులు హాజరై ఆయనకు అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూనే, వారి కుటుంబ సభ్యులు రాజకీయాల్లో రాణించి ప్రజాప్రతినిధులుగా పేరు ప్రతిష్టలు గడించారని అన్నారు. ఆయన ఉపాధ్యాయ సంఘం లో ఎన్నో ఏళ్లుగా నాయకులుగా చలామణి అవుతూ, విద్యాబోధనలో సైతం ఏనాడు ఎటువంటి సమస్య రాకుండా చూసుకుంటూ తన జీవితాన్ని ముందుకు సాగించారు. ఆయన ఉపాధ్యావృత్తిలో ఎన్నో ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. ఏ ప్రాంతంలో కూడా ఆయనపై ప్రజలు ఆరోపణలు చేయలేదు. ఆయన ఎప్పుడు చిరునవ్వుతో, ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించడం ఆయన నైజంగా చెప్పుకోవచ్చు. ముందస్తుగా పదవీ విరమణ పొందిన శంకర్ భవిష్యత్తులో రాజకీయంగా రాణించాలని ఎంతోమంది ఆశీర్వాదం అందించారు. ఆయన సతీమణి సర్పంచ్ గాను, ఉమ్మడి బోధన్ మండల జిల్లా పరిషత్ సభ్యురాలుగా కొనసాగారు. ఏనాడు రాజకీయల్లో ఎటువంటి ఆరోపణలు ఎదురు కాకుండా ప్రజామన్నలు పొందారు. తాను విద్యావంతురాలు కానప్పటికీ ఈ ప్రాంత ప్రజలు తనను ప్రజా ప్రతినిధిగా ఎన్నుకోవడం ఎంతో గర్వంగా భావించానని ఆయన సతీమణి అన్నారు. తన కుటుంబానికి తన మేనమామ అండదండలు అందించడంతోనే తమ కుటుంబం ఈరోజు ఈ స్థాయికి ఎదిగామని గర్వంగా చెప్పారు. ఈ ప్రాంత ప్రజలు ఎన్నో పర్యాయాలు మా కుటుంబానికి అండగా నిలిచారని వారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని ఆమె స్పష్టం చేశారు. 40 ఏళ్ల దాంపత్య జీవితంలో ఏనాడు తమ కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఎదురు కాకపోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. తాను గతంలో జెడ్పిటిసి గా ఉన్న సందర్భంలో సైతం పాఠశాలలకు వెళ్లిన సందర్భంలో తాను విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేసి సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలని సూచించానన్నారు.
బోధన్ ప్రింట్ మీడియా ఆత్మీయ సన్మానం
ముందస్తుగా పదవీ విరమణ పొందిన ఇల్తేపు శంకర్ కు బోధన్ ఫ్రంట్ మీడియా ఆత్మీయ సమ్మేళనంలో ఆత్మీయ సన్మానం చేశారు. ఆయనకు జర్నలిస్టుల తరఫున శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి జర్నలిస్టులతో స్నేహభావంతో మెలిగారని భవిష్యత్తులో కూడా వారు జర్నలిస్టులతో స్నేహభావంతో మెలగాలని జర్నలిస్టు సంఘం నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ ప్రింట్ మీడియా అధ్యక్షులు శ్రీనివాసరావు, పెద్దలు ముఖ్య సలహాదారులు బలరామరాజు, కోశాధికారి అహ్మద్, గడ్డం గంగులు, ఉమాకాంత్, నాగేశ్వరరావు, సమీర్, జగన్, చాపరాల రాజశేఖర్, శ్రీనివాస్, శివ, మధు, అశోక్, గట్టు శ్రీనివాస్, పొమ్మేడి హనుమాన్డ్లు, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.




