Thursday, February 12, 2026

బీసీలకు రాజ్యాధికారం అందించాలి

ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్ జూలై 29 ద్రోణ

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న వారి అజెండా బీసీలకు రాజ్యాధికారం రావడం
రాష్ట్ర ప్రభుత్వం,కేంద్ర ప్రభుత్వంపై,ఒత్తిడి తెచ్చి
బీసీ బిల్లు సాధించుకోవాలని రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు.
2018 పంచాయతీ రాజ్ సవరణ చట్టాన్ని సవరణ చేస్తూ తెలంగాణ జాగృతి చేసిన డిమాండ్ తో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ చేసిందన్నారు.
తమిళనాడులో గవర్నర్ జాప్యం చేస్తే కోర్టుకు వెళ్లి తీర్పు తెచ్చుకున్నారు.రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ వద్ద పెండింగ్ అంశంపై కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదు అని ప్రశ్నించారు.కాంగ్రెస్,బీజేపీకి ఉన్న ఒప్పందంతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోర్టుకు వెళ్లడం లేదన్నారు.కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేయాలి.గవర్నర్,రాష్ట్రపతి వద్ద ఉన్న పెండింగ్ బిల్లులపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే మంచి తీర్పు వచ్చింది.మేము వెళ్లి ధర్నా చేస్తాము ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు రావాలని పొన్నం ప్రభాకర్ అంటున్నారు.ఇది ఏమైనా సత్రం భోజనమా…?
రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా అఖిలపక్షంను ఢిల్లీకి తీసుకువెళ్లాలి అనీ డిమాండ్ చేశారు.అఖిలపక్షం ఢిల్లీకి రావాలని ఎమ్మెల్యేలు,ఎమ్మెల్యేలు,అన్ని
రాజకీయ పార్టీలకు లేఖలు రాయండి అని సలహా ఇచ్చారు.పొన్నం ప్రభాకర్ భాద్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం డ్రామా చేస్తోంది.కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే
కోర్టులో కేసు వేయాలి.
బీజేపీ బీసీ సీఎం,బీసీ పీఎం
అని అంటున్నారు.
బీజేపీకి బీసీలపై చిత్తశుద్ధి లేదు.బీజేపీ తప్పించుకుంటోంది.
రాష్ట్రం నుంచి ఇద్దరు
కేంద్రమంత్రులు ఉన్నా శూన్యం
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆగస్టు
4,5,6 తేదీల్లో నేను 72 గంటల నిరాహార దీక్ష చేస్తాను.
ప్రభుత్వ అనుమతి కోరి నిరాహారదీక్ష చేస్తాం.. ఒకవేళ అనుమతి ఇవ్వకుంటే ఎక్కడ కూర్చుంటే అక్కడే నిరాహారదీక్ష కు దిగుతాం అని హెచ్చరించారు.ఉమ్మడి రాష్ట్రంలో అంబెడ్కర్ విగ్రహ సాధన కోసం నేను 72 గంటలు దీక్ష చేశాను.
అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి
ప్రభుత్వం దిగివచ్చిందన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular