Thursday, February 12, 2026

యువత వ్యవసాయాన్ని పరిశ్రమగా రూపుదిద్దాలి

బోధన్ జులై 29 ద్రోణ

యువత ఉన్నతభ్యసాన్ని అభ్యసించి వ్యవసాయాన్ని పరిశ్రమగా రూపుదిద్దాలని వ్యవసాయ శాఖ సలహాదారులు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇప్పటికే ఎంతోమంది చదువుకున్న యువకులు వ్యవసాయం చేస్తున్నారని లాభాలను పెద్ద ఎత్తున గడించడం ఎంతో మంచి పరిణామం అన్నారు. వ్యవసాయంలో ముందస్తుగా సాగు చేయడం అత్యధిక దిగుబడి సాధించడం తెలంగాణ రాష్ట్రంలోనే బాన్సువాడ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో కొద్ది మాత్రమే నీటి నిల్వలు ఉన్నప్పటికీ వ్యవసాయం మీద ఉన్న ప్రాధాన్యంతో ఇప్పటికే రెండుసార్లు పంటల సాగు నీరు విడుదల చేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుందన్నారు. ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలను వ్యవసాయానికి విస్తరింప చేస్తున్నామన్నారు. వర్షాకాలంలో పంటలు పండించిన రైతులకు 500 రూపాయలు బోనస్ ఇవ్వడం ఎంతో గొప్ప విషయం అన్నారు. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా పండించిన పంటలకు బోనస్ రూపేన క్వింటాల్ 500 రూపాయలు ఇవ్వడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందన్నారు.
బాన్సువాడ నియోజక వర్గం రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని మంగళవారం పోచారం పరిశీలించారు. ఆవరణలో బియస్సీ అగ్రికల్చర్ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట
ఫుడ్ సైన్స్ & టెక్నాలజీ కాలేజీ ప్రిన్సిపాల్ వెంకట్ రెడ్డి ,పరిశోధన కేంద్రం అధికారి సమత పరమేశ్వరి , తాజా మాజీ జెడ్పిటిసి నా రోజు గంగారం, రుద్రూర్ విండో అధ్యక్షులు సంజీవరెడ్డి, పట్టపు రాములు, పత్తి రాము, కన్న రవి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అరుణ్ కుమార్, సులేమాన్ నగర్ సర్పంచ్, రుద్రూర్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular