Thursday, February 12, 2026

వైద్యులు మానవతాత దృక్పథంతో వైద్యం అందించాలి

మంత్రి సీతక్క

హైదరాబాద్ జూలై 31 ద్రోణ

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క వైద్యాధికాలకు సూచించారు.
గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తో కలిసి సీజనల్ వ్యాధుల పై వైద్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అనే నినాదానికి బద్ధులై పనిచేయాలని, వైద్యుడుగా కనిపించే దేవుళ్ళని , వర్షాకాలంలో వచ్చే మలేరియా డెంగ్యూ అతి సార టైఫాడ్లపై చికిత్స తో పాటు గ్రామాలలో గ్రామ పెద్దలు యువకుల సమూహంతో అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని, అప్పుడే ప్రజలు వ్యాధి నియంత్రణ పట్ల చైతన్యవంతులు అవుతారని తెలిపారు. దట్టమైన అడవి ప్రాంతాలు, రోడ్డు సౌకర్యం లేని గ్రామాలలో ఉదయాన్నే గ్రామాలకు వైద్య సిబ్బంది చేరి ఇంటింటి సర్వే చేసి వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్సను అందించి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించాలని వైద్య సిబ్బందిని సూచించారు.
గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. వారికి పరీక్షలు, మందులు సకాలంలో అందించాలని అన్నారు.
రాబోయే రెండు నెలలు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి వైద్య సేవలు అందించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రతి రోగి ముఖ్యుడే అని, మానవతా దృక్పథంతో పనిచేయాలని, రోగుల పట్ల ప్రేమ వాత్సల్యంతో వైద్యం అందిస్తే ప్రజలలో వైద్యుల పేర్లు చిరకాల నిలుస్తుందని, వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ములుగు కు వచ్చే రోగులకు అన్ని రకాల వైద్య సేవలను అందించాలని జనరల్ హాస్పిటల్ ములుగు అధికారులను సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం లో వచ్చే వ్యాధులను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఆరోగ్య కేంద్రానికి ముందస్తుగానే నిధులను మంజూరు చేశామని గత సంవత్సర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగానే వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై పటిష్టమైన ప్రణాళికలను తయారుచేసుకొని చివరి సర్వే, ఆంటీ లార్వా చర్యలను, నిర్వహిస్తున్నామని హైరిస్కు గ్రామాలను ముందస్తుగానే గుర్తించామన్నారు ఆ గ్రామాలలో దోమల నియంత్రణకై యాంటీ లార్వా స్ప్రే మరియు ఫాగింగ్ లాంటి చర్యలు తీసుకున్నామని దానితోపాటు ప్రతి గ్రామం లో ఇప్పటి వరకే రెండు పర్యాయాలు ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించామని ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ఆశ్రమ స్కూల్లో కూడా వైద్య శిబిరాలను నిర్వహించి విద్యార్థులకు వైద్య చికిత్సలను అందించటంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పోషకాహార ప్రాముఖ్యత మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాల్ రావు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, ములుగు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ స్వర్ణ కుమారి, ఏటూరునాగారం
డి సి హెచ్ డాక్టర్ జగదీష్, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ విపిన్ కుమార్, డాక్టర్ క్రాంతి, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ చంద్రకాంత్, డాక్టర్ రణధీర్, డాక్టర్ పవన్ కుమార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు జనరల్ హాస్పిటల్ వివిధ విభాగాల అధికారులు మెడికల్ కాలేజ్ వివిధ విభాగాల ప్రొఫెసర్, డెమో సంపత్, ఆర్ బి ఎస్ కే టీం వైద్యాధికారులు ఎం సి హెచ్ టీం వైద్యాధికారులు, మిడ్ లేవల్ హెల్త్ ప్రొవైడర్స్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular