హైదరాబాద్ ఆగస్టు 31 ద్రోణ
తొర్రురు పట్టణ కేంద్రంలో చెమ్మనూరు గ్రూప్‌కి చెందిన చెమ్మనూరు క్రెడిట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ నూతన శాఖను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సి రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా సంప్రదాయ పూజాకార్యక్రమాల నడుమ రిబ్బన్ కట్ చేసి, ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఝాన్సి రాజేందర్ రెడ్డి కార్యాలయం ప్రాంగణాన్ని సందర్శించి, సంస్థ అందిస్తున్న సేవలపై నిర్వాహకుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఝాన్సి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తొర్రూరు వంటి అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో ప్రజలకు నమ్మకమైన ఆర్థిక సేవలు అందించే సంస్థలు అవసరం. చెమ్మనూరు గ్రూప్ దేశవ్యాప్తంగా విశ్వసనీయతను సంపాదించుకున్న సంస్థ. ఇక్కడ ప్రారంభమైన క్రెడిట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ శాఖ ద్వారా ప్రజలకు తక్కువ వడ్డీతో రుణాలు, పెట్టుబడి అవకాశాలు లభిస్తాయి. ఇది స్థానిక వ్యాపార వృద్ధికి, స్వయం ఉపాధికి దోహదపడుతుంది అని పేర్కొన్నారు.నిర్వాహకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ చెమ్మనూరు సంస్థ సేవల విశేషాలను వివరించారు. వారి ప్రకారం, ఈ శాఖలో వ్యక్తిగత అవసరాల కోసం స్వల్పకాలిక రుణాలు, బంగారంపై లోన్‌లు, పెట్టుబడి పథకాలు తదితర సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, మహిళా సంఘాలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమ ముగింపు సందర్భంగా చెమ్మనూరు సంస్థ ప్రతినిధులు ఝాన్సి రాజేందర్ రెడ్డి కి శాలువా కప్పి, స్మృతిచిహ్నం అందజేశారు.



