Thursday, February 12, 2026

పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యం

షో రూమ్ లో ప్రారంభించిన ఎమ్మెల్యే ఎస్ఎస్వి రెడ్డి

పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి చేయడమే తన లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి స్పష్టం చేశారు.
పాలకుర్తి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాలక్ష్మీ 2 వీలర్ మల్టీ బ్రాండ్ వెహికిల్ షోరూమ్ ను పాలకుర్తి శాసనసభ్యురాలు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ కార్యక్రమం సంప్రదాయ పద్ధతిలో ప్రారంభమైంది. ఎమ్మెల్యే షోరూమ్ ప్రారంభోత్సవ ఫితాను కట్ చేసి, అక్కడ ఏర్పాటు చేసిన బైక్‌లకు పూజలు నిర్వహించారు. అనంతరం షోరూమ్‌ను పరిశీలించి అందుబాటులో ఉన్న వివిధ మల్టీ బ్రాండ్ బైక్‌ల గురించి నిర్వాహకుల నుండి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా *ఎమ్మెల్యే మాట్లాడుతూ పాలకుర్తిలో ఇలాంటి మల్టీ బ్రాండ్ 2 వీలర్ షోరూమ్ ప్రారంభం కావడం అభినందనీయం అన్నారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంత ప్రజలకు నగరానికి వెళ్లకుండా, తాము కోరిన బ్రాండ్ బైక్‌లు స్థానికంగా లభించనున్నాయి. ఇది ప్రజలకు మేళవింపు కలిగించే మంచి అవకాశం. అలాగే, ఈ షోరూమ్ ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయి. అభివృద్ధి చెందుతున్న పాలకుర్తిలో ఇదొక ప్రగతిశీల అడుగు అని పేర్కొన్నారు.అలాగే పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచడమే తన లక్ష్యమని, యువత పారిశ్రామిక రంగం వైపు ముందుకు రావాలని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో షోరూమ్ నిర్వాహకులు ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వ్యాపార వర్గాలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై సందడి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular