బాన్సువాడ మున్సిపల్ అధికారులతో సమీక్ష పోచారం
బాన్సువాడ జూలై 31 ద్రోణ
వర్షాకాలంలో మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఏర్కోకుండా చూడాల్సిన బాధ్యతను గుర్తించాలని ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అధికారులకు సూచించారు.బాన్సువాడ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులు, వార్డు అధికారులతో పారిశుద్య నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వార్డు అధికారులతో మాట్లాడుతూ వార్డులలో డ్రైనేజీ వ్యవస్థలను క్రమం తప్పకుండా శుభ్రపరచడం చాలా ముఖ్యం అని పోచారం స్పష్టం చేశారు.
ఇది మురికి, వ్యర్థాలు మరియు ఇతర అడ్డంకులు పేరుకుపోకుండా నిరోధిస్తుంది.
తద్వారా అధిక వర్షపాతం ద్వారా వచ్చే నీరు సాఫీగా ప్రవహించేలా చేస్తుంది.
ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకొనే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోండి.
ఈ కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపల్ కమిషనర్,వార్డు అధికారులు, పట్టణ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



