Thursday, February 12, 2026

పేదింటి ఆడపడుచులను ఆదుకోవడమే కాంగ్రెస్ లక్ష్యం

లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన పోచారం

బోధన్ జులై 31 ద్రోణ

పేదింటి ఆడపడుచులను ఆదుకోవడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని ప్రభుత్వ సలహాదారులు బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ మరియు గ్రామీణ మండలం, నసురుల్లాబాద్,బీర్కూర్ మండలాల కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ 99 చెక్కులను లబ్ధిదారులకు పోచారం అందజేశారు. ఆయన వెంట
బాన్సువాడ సబ్ కలెక్టర్ శ్రీమతి కిరణ్మయి , ఉమ్మడి బీర్కూర్ మండల మార్కెట్ కమిటీ అధ్యక్షులు దుర్గం శ్యామల శ్రీనివాస్ , మరియు బాన్సువాడ పట్టణ మరియు బాన్సువాడ గ్రామీణ, నసురుల్లాబాద్, బీర్కూర్ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు,అధికారులు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
బాన్సువాడ పట్టణం మరియు గ్రామీణ మండలం 46 మంది లబ్ధిదారులకు రూ.46,05,336/,బీర్కూర్ మండలం 30 మంది లబ్ధిదారులకు రూ.30,03,480/,
నసరుల్లాబాద్ మండలం 23 మంది లబ్ధిదారులకు రూ.23,02,668/-చెక్కులను పంపిణీ చేశారు.

ప్రజా సమస్యలు పరిష్కరించడమే లక్ష్యం

రాజకీయాల్లో అపార అనుభవం, ప్రతినిత్యం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భావిస్తూ బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలోనూ, సంక్షేమ పథకాలు అందించడంలో తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిపిన ఘనత బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డికి దక్కుతుందని చెప్పవచ్చు. ఆయన ఏ పార్టీలో ఉన్న తన నియోజకవర్గం అభివృద్ధి పైనే ప్రతినిత్యం దృష్టి పెడతారు. ఆయన పలు పార్టీల్లో కొనసాగి పలు కీలక మంత్రి పదవిలో సైతం పనిచేశారు. ఏ పార్టీలో ఉన్న ఏ మంత్రి పదవిలో ఉన్న ఆయన ఆ పదవికె కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టారు. సంక్షేమ పథకాలు అందించడం ఏనాడు వెనకడుగు వేయకుండా ప్రజలకు ఎంత చేరువలో ఉన్న మరింత చేరువుగా ఉండాలన్న లక్ష్యంగా తన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆయన వయసు రిటైర్మెంట్ వయసు దాటినప్పటికీ నేటికీ ఇంకా యువకుడిలా ప్రజల మధ్యలో ప్రతినిత్యం తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వెనువెంటనే పరిష్కరించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇతర ఎమ్మెల్యేల మాదిరిగా కాకుండా తాను చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రజలకు ప్రతినిత్యం అందిస్తూ ప్రజల మధ్యనే తిరుగుతూ ఇంకా ప్రజా సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటూ ప్రజలను ప్రశ్నిస్తూ బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. నియోజకవర్గంలోని ఏ ఒక్కరు కూడా ఇల్లు లేకుండా గుడిసెల్లో, అద్దె ఇళ్లల్లో నివాసం ఉండకూడదన్న జీవిత ఆశయంగా ముందు కు సాగుతున్నారు. గత టీఆర్ఎస్ ఆనాటి ప్రభుత్వం టు బి హెచ్ కె ఇళ్ల నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పేదలకు ఇళ్ళను అందించే ప్రయత్నం చేశారు. కానీ ప్రభుత్వం రాష్ట్రమంతా ఈ పథకాన్ని సఫలం చేయలేకపోయారు. కానీ బాన్సువాడ నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎంతో సాహసంపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఆనాడు ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చారు. బాన్సువాడ నియోజకవర్గం లో 11 వేల జిల్లా నిర్మాణాలను చేపట్టి పేదలకు గూడు కల్పించి బాన్సువాడ నియోజకవర్గంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే తన సత్తాను చాటుకున్నారు. ప్రభుత్వం ఏ పథకాన్ని అమలు చేసిన తన నియోజకవర్గంలో ఆ పథకాన్ని ఆదర్శవంతంగా అమలు చేసే ప్రయత్నం ప్రతినిత్యం పోచారం శ్రీనివాస్ రెడ్డి చేస్తూ ఉంటారు. సిమెంట్ రోడ్ల విషయంలోనూ ఎంతో శ్రద్ధ తీసుకొని నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లను ఏర్పాటు చేశారు. ఏ వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగపరిచి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో పోచారం మాత్రమే ప్రత్యేక స్థానాన్ని సంపాదించారని చెప్పవచ్చు. నియోజకవర్గంలో ఆలయ నిర్మాణాల్లో సైతం ఎంతో పెద్ద ఎత్తున నిధులను సమకూర్చి ప్రతి గ్రామంలో అడిగిన వారికి కాదనకుండా ఆలయ నిర్మాణాలను చేపట్టిన ఘనత ఆయనకే దక్కింది.

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్

గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డల వివాహాలకు వారి తల్లిదండ్రులు ఎటువంటి ఇబ్బందులు చవిచూడకుండా ఉండేందుకు కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. పేద ఇంటివారు ఎవరు వివాహం చేసిన దరఖాస్తు చేసుకునే వీలు కల్పించడంతోపాటు వారికి ప్రభుత్వం నుండి ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించిన ఘనత కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డికి దక్కిందని చెప్పుకోవచ్చు. కళ్యాణ లక్ష్మి మంజూరైన నిధులను బాధ్యత కుటుంబాలకు అందే విధంగా తన కర్తవ్యాన్ని ప్రతినిత్యం పోచారం నిర్వహిస్తూ ఉంటారు. ప్రభుత్వ సహాయం చేస్తుంది అధికారులు పంపిణీ చేస్తారు అన్న చందంగా రాకుండా ప్రతిదారులకు తన చేతి మీదగా చెక్కులను ప్రతినిత్యం పంపిణీ చేస్తూ ఉంటారు. కళ్యాణ లక్ష్మి ఆర్థిక సహాయం లోను తెలంగాణ రాష్ట్రంలోనే బాన్సువాడ నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచింది.

పంటల సాగులో, దిగుబడిలో తెలంగాణకే బాన్సువాడ ఆదర్శం

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నియోజకవర్గ అభివృద్ధితో పాటు, తన నియోజకవర్గంలో వ్యవసాయం కూడా తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచే విధంగా ప్రతినిత్యం రైతన్నలకు పోచారం అండదండలు అందిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ముందస్తుగా వరి నాట్లు వేసుకోవడం, నాణ్యమైన ధాన్యాన్ని పండించడంతోపాటు అత్యధిక దిగుబడులు బాన్సువాడ నియోజకవర్గం లోని రైతులే సాధిస్తున్నారని చెప్పవచ్చు. రైతు కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి నేడు ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ ప్రతినిత్యం పోచారం శ్రీనివాసరెడ్డి రైతు, కూలీల శ్రేయసే దేయంగా ముందుకు సాగుతూ ఉంటారు. నిజాంసాగర్ లో కొద్దిపాటి నీటి నిల్వలు ఉన్నప్పటికీ పంటల సాగులో రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని, ప్రకృతి సహకరించకపోయినా సాగర్ లో ఉన్న నీటిని పంటల సాగుకు విడుదల చేర్పించడంలో పోచారం ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారు. నీటిని విడుదల చేపించి చేతులు దులుపుకొని ఉండరు. తానే వాహనంలో కాలువలపై తిరుగుతూ ఏ ప్రాంతానికి మీరు అందలేదు ఆ ప్రాంతం పంటల సాగుకు నీరు అందే విధంగా మెలకువలు తీసుకుంటూ ఉంటారు. పోచారం సహకారం, ప్రకృతి సహకరించడంతో ఈ ప్రాంతంలో రైతన్నలు పెద్ద ఎత్తున వరి పంటలను సాగు చేయడంతో పాటు ఆర్థికంగా నెల తొక్కుకుంటూ రాష్ట్రంలోనే ఈ ప్రాంతాన్ని మొదటి స్థానంలో నిలపగలిగారు.

వైద్యం విద్యలోనూ తీసి పోదు బాన్సువాడ

పేద ప్రజలకు వైద్యం, విద్య అందించడంలోనూ బాన్సువాడ నియోజకవర్గం తీసిపోదు అన్న విధంగా తీర్చిదిద్ద గలిగారు. ప్రభుత్వ ఆసుపత్రుల విషయంలో ఎన్నో కోట్ల రూపాయలతో భవనాలను నిర్మించడంతోపాటు, వైద్యుల నియామకాల్లోనూ ఆయన ప్రతినిత్యం పోరాటం చేస్తూనే ఉంటారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమన్న లక్ష్యంతో పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించి వారి కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా ఎన్నో గొప్ప నిర్ణయాలను పోచారం తీసుకున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో విద్యాపరంగా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిల్ప గలిగారు. మారుమూల ప్రాంతాల్లో సైతం విద్యా వైద్యం అందుతుందా లేదా అన్న విషయంపై ప్రతినిత్యం పరిశీలన చేస్తూనే ఉంటారు. ప్రతినిత్యం నేరుగా ప్రభుత్వ ఆసుపత్రులను, విద్యా కేంద్రాలను తనిఖీలు చేస్తూ, ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ ఉంటారు. పరిపాలన తనదైన శైలిలో నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేకముద్ర వేసుకున్న ఘనత పోచారం కె దక్కింది. విద్యుత్ విషయంలోనూ ఒక అడుగు ముందే వేశారు. రాబోయే 15 ఏళ్లకు సరిపడ కూడా సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, ప్రత్యేక విద్యుత్ లైన్ ల ఏర్పాటుకు ఎంతగానో కృషి చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున విద్యుత్ పంప్ సెట్ లో ఉన్నప్పటికీ ఏనాడు రైతులకు ఇబ్బందులు ఎదురైన సందర్భాలు కానరావు. 200 కోట్లతో ప్రత్యేక పాఠశాల సముదాయాన్ని నిర్మింప చేసేందుకు నిధులు మంజూరుకు పోచారం కృషి చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలోని పొతంగల్ మండలం పి ఎస్ ఆర్ నగర్ లో ఇప్పటికే ఉన్నతాధికారులు స్థల పరిశీలన జరిపారు. త్వరలో 200 కోట్లతో బృహత్తర విద్యా వ్యవస్థ సైతం బాన్సువాడ నియోజకవర్గంలో ఏర్పాటు కాబోతోంది.

హైదరాబాదులో ఉన్న తన మనసంతా బాన్సువాడ వైపే

శాసనసభ సమావేశాల సందర్భంలోనూ, ఇతర అభివృద్ధి పనుల మంజూరుల విషయంపై హైదరాబాద్ వెళ్ళిన సందర్భాల్లోనూ పోచారం మనసంతా బాన్సువాడ నియోజకవర్గ పైనే ఉంటుంది. హైదరాబాదులో ఉన్నప్పటికీ ప్రతినిత్యం ఆయన ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులతో, రైతులతో ఫోన్లో ఎంతో ఓపికతో మాట్లాడుతూ ఉంటారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ ప్రజా ప్రతినిధులకు, పేద ప్రజలకు తన అండదండలు అందిస్తూ ఉంటారు. ఆయనకు ఒక్కోసారి కోపం వస్తూ ఉంటుంది ఆ కోపంలో కొంత ఆగ్రహానికి గురవుతూ ఉంటారు. కోపం వచ్చిన సందర్భంలో ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత మళ్లీ తన మనసును శాంతింప చేసుకుని, నాకు తప్పదు కదా మీ సమస్య ఏందో చెప్పండి అంటూ సంబంధిత అధికారులకు ఫోన్లో మాట్లాడి ప్రజా సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

కాసుల బాలరాజ్ తో స్నేహబంధం

గత శాసనసభ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి బరిలో దిగి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డితో తలపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం వైదొలగడంతో పోచారం రాజకీయ పరిణామాలు బేరీజు వేసుకొని, కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రెండు పర్యాలు తన ప్రత్యర్థిగా కాసుల బాలరాజుతో శాసనసభ ఎన్నికల్లో తలపడ్డారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడంతో తనతో రెండు పర్యాయాలు తలపడ్డ కాసుల బాలరాజుతో స్నేహబంధం ఏర్పడ్డది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరన్న విషయాన్ని పోచారం నిరూపించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుండి నేటి వరకు కాసులను వెంటపెట్టుకొని, ఆయన దళాన్ని సైతం దగ్గర తీసుకొని, తన దళాన్ని వదులుకోకుండా ఎరువు వర్గాలను మెప్పించుకుంటూ ఒప్పించుకుంటూ రాజకీయాల్లో ముందుకు సాగుతున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తనకు ప్రత్యర్థి పార్టీ గా ఉండేది. అటువంటి నాయకులను సైతం తన ధరిన చేర్చుకొని రాజకీయ మనుగడను సాఫీగా కొనసాగిస్తున్నారు. ఆనాటికన్నా నేడు నియోజకవర్గంలో బలంగా ఉన్నామని పోచారం పదేపదే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ల విషయంలోనూ ప్రతినిత్యం లబ్ధిదారులతో, ఇందిరమ్మ కమిటీ సభ్యులతో మరియు అధికార యంత్రాంగంతో సమాలోచనలు చేస్తూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లోనూ బాన్సువాడ నియోజకవర్గం ఆదర్శప్రాయంగా నిలిచింది. పోచారం సంక్షేమ అభివృద్ధి విషయాలలో ఎంత చెప్పుకున్నా తక్కువే అని చెప్పుకోవచ్చు.

తన తనయుడు భాస్కర్ రెడ్డి వారసుడు

తన తనయులు పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డిలు రాజకీయాల్లో కొనసాగుతూ వచ్చారు. పదేళ్లపాటు నియోజకవర్గంలోని ప్రజలకు వారి తనయుడు సైతం తమ వంతు సహాయ సహకారాలను అందిస్తూ వచ్చారు. ప్రస్తుతం రాజకీయాల్లో వచ్చిన మార్పులు దృష్టిలో పెట్టుకుని పోచారం తన వారసుడిగా భాస్కర్ రెడ్డిని ప్రకటించారు. కుటుంబంలో రాజకీయ విభేదాలు తలెత్తకుండా ఉండేందుకు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తన మనసులో ఉన్న మాటను కార్యకర్తలతో పంచుకున్నారు. భాస్కర్ రెడ్డి సైతం ప్రతినిత్యం కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉంటూ ప్రతి విషయంలోనూ అండగా నిలుస్తున్నారు. భవిష్యత్ రాజకీయాల్లో భాస్కర్ రెడ్డి బాన్స్వాడ నియోజకవర్గం లో చురుకైన పాత్ర పోషించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. భాస్కర్ రెడ్డి కోపంగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఆయనను ఆశ్రయించిన వారికి ప్రతి విషయంలో సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. తనను ఆశ్రయించిన వారికి ముక్కుసూటిగా సమాధానం చెబుతూ తనదైన శైలిని చాటుకుంటారు. బాన్సువాడ భవిష్యత్తు రథసారధిగా భాస్కర్ రెడ్డి అని ఇప్పటికే కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular