వ్యక్తిగత కార్యదర్శి లక్ష్మారెడ్డి పై పోచారం ప్రశంసల వర్షం
ప్రజా ప్రతినిధులు సమాజ హితం కోసం కృషి చేయాలని, అధికారుల పై ఒత్తిళ్లు తీసుకొచ్చి వ్యక్తిగత లాభాపేక్షకు లోనైతే సమాజం నాశనమవుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ పట్టణంలో తన వ్యక్తిగత కార్యదర్శి లక్ష్మారెడ్డి పదవి విరమణ సందర్భంగా ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో పోచారం పాల్గొన్నారు. తన వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా లక్ష్మారెడ్డి 2014 నుండి పని చేస్తూ వచ్చారని. ఆయన నిబద్ధత, ఎంతో గొప్పదని ఆయన ఏనాడు తాను చెప్పిన మాట జవ దాటపోవడం, తన నియోజకవర్గ ప్రజలకు ప్రతినిత్యం రాత్రి పగలు అనే తేడా లేకుండా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వైద్యం నిమిత్తం, వచ్చేవారికి ఎప్పుడూ చేదోడువాదోడుగా సేవలందించారని, ఆయన సేవలను తాను, తన కుటుంబం, తన నియోజకవర్గ ప్రజలు ఎన్నటికీ మరువరాని పోచారం స్పష్టం చేశారు. ఆయన అలాంటి వ్యక్తిగత కార్యదర్శులు తనకు లభించటం తన అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. ఉద్యోగ విరమణ ప్రభుత్వ ఉద్యోగులకు ఒక బాధ్యత లాంటిదని, ప్రతి ఒక్కరు ఉద్యోగ విరమణ పొందాల్సి ఉంటుందన్నారు. తన వ్యక్తిగత కార్యదర్శి లక్ష్మారెడ్డి ఆయన సతీమణి సహాయ సహకారాలతోనే ప్రజలకు సేవలు అందించగలిగారని, ఆమె ఓపికను, సహనాన్ని కొనియాడారు. కోవిడ్ సమయంలో ఎంతోమంది అనారోగ్యాన్ని గురై ఇబ్బందులు పడుతున్న సందర్భంలో లక్ష్మారెడ్డి ఎంతో గొప్పగా తన వంతు పాత్రను పోషించారన్నారు. తన నియోజకవర్గం లోని ప్రతి ఒక్కరికి లక్ష్మారెడ్డి ప్రత్యక్షంగా పరోక్షంగా, తన వంతు సహాయ సహకారాలు అందించిన విషయాన్ని ఎన్నటికీ మరువలేమన్నారు. తన వద్ద వ్యక్తిగత కార్యదర్శులుగా పనిచేసేవారిని తాను ఎప్పుడు తన వ్యక్తిగత లాభం కోసం ఒత్తిడిలకు గురి చేయలేదని సభాముఖంగా పోచారం స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజాప్రతినిధులు చేయడం వ్యక్తిగత లాభాలకు ఆశించడం సమాజ నాశనంతో పాటు ఉద్యోగుల్లో ప్రజాప్రతినిధులపై ఉన్న నమ్మకం సన్నగిల్లుతుందన్నారు. తాను 40 ఏళ్లుగా రాజకీయ జీవితం సాఫీగా కొనసాగిస్తున్నానంటే తన వద్ద పనిచేసిన ఉద్యోగులు, తన నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులు ఉన్నాయన్నారు. తన వద్ద వ్యక్తిగత కార్యదర్శులుగా భగవాన్ రెడ్డి 25 ఏళ్లుగా పనిచేసే ఆయన కూడా ఉద్యోగ విరమణ పొందారన్నారు. ఏనాడు వ్యక్తిగత కార్యదర్శులు తన గీత దాటకుండా తనకు ఎటువంటి తలనొప్పులు ఎదురుకాకుండా చూసిన గొప్పతనం కూడా వారిదేనని స్పష్టం చేశారు.
పోచారం వద్ద పనిచేయడం తాను అదృష్టంగా భావిస్తున్న
రాజకీయ దురంధరుడు, 40 ఏళ్లుగా తన రాజకీయ జీవితాన్ని బాన్సువాడ నియోజకవర్గం లోనే కాకుండా, రాష్ట్రస్థాయిలో సాఫీగా కొనసాగిస్తూ ప్రజా మానన్న లు పొందిన పోచారం శ్రీనివాస్ రెడ్డి వద్ద పనిచేయడం తాను అదృష్టంగా భావిస్తున్నానని వ్యక్తిగత కార్యదర్శి లక్ష్మారెడ్డి సభ ముఖంగా తెలిపారు. వారి వద్ద పనిచేయడం కష్టమని తాను విధుల్లో చేరిన సందర్భంలో ఎంతోమంది తనను హెచ్చరించారన్నారు. అయినప్పటికీ తాను ఒదిగి, ఓపికతో సహనంతో ఆయన వద్ద విధులు నిర్వహించి, ప్రజలకు ఏ రకంగా ఉద్యోగులు సేవలు అందించవచ్చు పాఠం నేర్చుకున్నానని అన్నారు. కోవిడ్ సమయంలో ఎంతోమంది అనారోగ్యానికి గురైన సందర్భంలో 24 గంటలు ఏ సందర్భంలో అయినా ఫోన్లు వస్తూ ఉండేది. అయినప్పటికీ తాను తన స్థాయికి మించి, కుటుంబ భాగస్వామ్యంలో కొంత భాగం పని ఒత్తిడిని తగ్గించుకొని బాన్స్వాడ నియోజకవర్గ ప్రజలకు తన వంతు సేవలు అందించే భాగ్యం కలిగిందన్నారు. రాత్రి వేళల్లో ఆనాటి కోవిడ్ సందర్భంలో తనను కుటుంబ సభ్యులకు దూరంగా వేరే రూములో నిద్ర పోవాల్సిందిగా పోచారం సలహా ఇచ్చారని అన్నారు. తాను కూడా వారి మాటలు ఎప్పుడూ దాటకుండా, ప్రతి విషయాన్ని పోచారం దృష్టికి తీసుకువెళ్లి క్రాస్ చెక్ చేసుకునేవాడినని, వారి వద్ద ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నానని, వారి అడుగుజాడల్లో జీవిత గమ్యాన్ని పూర్తి చేస్తానన్నారు. తన సతీమణి ఏనాడు తనకు ఇంటిలో పరువు బాధ్యతలపై ప్రశ్నించేది కాదని, అలాంటి సహకారం ఉండడంతోనే ఇలాంటి సేవలో నిమగ్నమై ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించానన్నారు. ఈ కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, నిజాంబాద్ జిల్లా సహకార బ్యాంక్ మాజీ అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి, శంభు రెడ్డి, సురేందర్ రెడ్డి, డిపిఓ శ్రీనివాస్, జిల్లా పరిషత్ సీఈవో సాయ గౌడ్, నాయకులు శంకర్ పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, ఏజాజ్ ఖాన్, జుబేర్, నా రోజి గంగారాం, భాస్కర్ రెడ్డి, బిల్లా రామ్మోహన్, న్యాయవాది భూషణ్ రెడ్డి, మోసరా విండో అధ్యక్షులు రాములు, వర్ని గోపాల్, రాజు, శంకర్, కాలేక్, శ్రీనివాస్, కన్నె రవి, గంగాధర్, ప్రతి లక్ష్మణ్, కూచి సిద్దు, పత్తి రాము వివిధ మండలాలకు చెందిన కార్యకర్తలు, అభిమానులు, లక్ష్మారెడ్డి బంధుమిత్రులు, స్నేహితులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.











