బోధన్ ఆగస్టు 4 ద్రోణ
కోటగిరి ఎస్ఐ సునీల్ కుమార్ పై బిజెపికి చెందిన నాయకులు ఏసిపి శ్రీనివాస్ కు ఫిర్యాదు చేశారు.రుద్రూరు మండల కేంద్రంలో ఆదివారం రోజు ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని ముగించుకొని ఇంటికి వెళ్లే క్రమంలో కోటగిరి మండల కేంద్రంలో గల ఓ ఎయిర్ కటింగ్ సెలూన్ షాపులో కటింగ్ చేయించుకుందామని వెళ్లడం జరిగింది. అదే సమయంలో కోటగిరి ఎస్సై సునీల్ అక్కడ హెయిర్ కటింగ్ చేయించుకుంటున్నారు. ఆ సందర్భంలో ఎస్సై సునీల్ నన్ను అరే ఎవడ్రా బాబు నువ్వు బయటకు వెళ్ళు ఇక్కడ నేను ఉన్నాను కదా కనిపించడం లేదా నీకు అని నాతో వాగ్వాదానికి దిగి దుర్భాషలాడారు.నేను భారతీయ జనతా పార్టీ రుద్రూర్ మండల అధ్యక్షున్ని అని చెప్పినప్పటికీ కూడా నువ్వు బిజెపి అధ్యక్షుడు అయితే నేను భయపడాలా నువ్వు ముందు బయటకి వెళ్లి మాట్లాడు అని నన్ను హెచ్చరించారు. ఎస్సై సునీల్ ఆ సమయంలో షాపులో నుండి బయటకి వెళ్ళిపో అని నన్ను కోపగించుకున్నా అక్కడి నుండి నేను వెళ్లలేదు. ఆ విషయాన్ని మనసులో ఉంచుకొని అప్పుడే పదిమంది కానిస్టేబుల్ లను పిలిపించి నాకు కటింగ్ చేయొద్దు అని షాప్ బంద్ చేయండి అని సెలూన్ షాప్ వర్కర్ కి చెప్పి వెళ్ళిపోయాడు. నేను బిజెపి మండల అధ్యక్షుడు అని చెప్పిన తర్వాత కూడా నన్ను ఇలా ఇబ్బందికి గురి చేశారు. ఉద్దేశపూర్వకంగా నన్ను కావాలనే ఇలా బెదిరించి మాట్లాడటం జరిగింది. అందువలన ఎస్సై సునీల్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సోమవారం బోధన్ ఏసీపీ ని కలిసి ఫిర్యాదు చేశారు.
