బోధన్ ఆగస్టు 4 ద్రోణ
ఉన్న విద్యను అభ్యసించిన యువత సైతం వ్యాపారాలపై మొగ్గు చూపాలని, ఇప్పటికే ప్రభుత్వ ప్రవేట్ ఉద్యోగాలు దొరకక ఎంతోమంది యువకులు ఉపాధి కోసం ఎన్నో పాట్లు పడుతున్నారని, యువత వ్యాపారాలపై మొగ్గుచూపి లాభాలను అర్జించాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ భాస్కర్ రెడ్డి సూచించారు.బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండల పరిధిలో పలు శుభకార్యాలకు మరియు ప్రారంభోత్సవాలకు హాజరై వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి.
వర్ని మండలం మల్లారం గ్రామంలో పోచారం భాస్కర్ రెడ్డి అభిమాని దిలారి బాబు కి నూతనంగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం కొరకు భూమి పూజ చేసి బాబు కుటుంబ సభ్యులకు తెలిపారు.వర్నిల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జై జగదంబా పేపర్ ప్లేట్స్ & డిస్పోసెల్ దుకాణాన్ని ప్రారంభించి దుకాణం యజమాని వెంకటేష్ కి శుభాకాంక్షలు తన గృహప్రవేశ మహోత్సవానికి హాజరై వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమాలలో వర్ని మండల మార్కెట్ కమిటీ అధ్యక్షులు సురేష్ బాబా మరియు వర్ని మండల ప్రజాప్రతినిధులు, నాయకులు పోచారం భాస్కర్ రెడ్డి వెంట ఉన్నారు.









