Thursday, February 12, 2026

నిజాం సాగర్ నీటి విడుదల

లిఫ్ట్ లను పరిశీలించిన పోచారం

బాన్సువాడ ఆగస్టు 4 ద్రోణ

నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలో రైతులు పెద్ద ఎత్తున వరి పంటను సాగు చేశారని, వరుణదేవుడు కరుణించకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని, పంటలు ఎండిపోకుండా నిజాంసాగర్ నీటిని విడుదల చేయాలని ప్రభుత్వ సలహాదారు బాన్సువాడ శాసనసభ్యులు అధికారులను ఆదేశించారు.చింతల్ నాగారం లిఫ్ట్ ఇరిగేషన్ చివరి ఆయకట్టు వరకు నీరు అందటం లేదని రైతుల అభ్యర్థన మేరకు చింతల్ నాగారం లిఫ్ట్ ఇరిగేషన్ ను పరిశీలించిన శాసనసభ్యులు.
బాన్సువాడ చింతల్ నాగారం లిఫ్ట్ ఇరిగేషన్ ను పరిశీలించి పైప్ లైన్ లీకేజీ వలన చివరి ఆయకట్టు వరకు నీరు అందటం లేదని సంబంధిత అధికారులకు,నిర్వాహకులకు పైప్ లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు తెలియచేశారు
వ్యవసాయానికి సాగునీరు అవసరాల కొరకు మంజీరాలో చెక్ డ్యాం నిర్మించుకున్న సందర్భంగా మంజీరాలో పుష్కలంగా నీరు ఉన్న కానీ పైపు లైను లీకేజీ వలన పంటలకు సాగు నీరు అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి, కావున పైప్ లైన్ లీకేజీలు తొందరగా పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని, అదేవిధంగా వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలోని పంటలు నీరు అందక ఎండుతున్న సందర్భంగా రేపు నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి నీరు విడుదల చేసి పంటలను రక్షించాలి అని చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ ని ఆదేశించారు.

రేపు ఉదయం నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి మెయిన్ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేస్తున్నట్టు చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular