Thursday, February 12, 2026

బాధితులకు న్యాయం చేకూర్చడమే పోలీసుల బాధ్యత

సిపి సాయి చైతన్య

నిజామాబాద్ ఆగస్టు 4 ద్రోణ

న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించే బాధితులకు అండగా నిలబడి న్యాయం చేయడమే పోలీసుల బాధ్యతని నిజామాబాద్ జిల్లా సిపి సాయి చైతన్య బాధితులకు భరోసా అందిస్తున్నారు. పోలీస్ బాస్ తనదైన శైలిలో తన వద్దకు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చడమే తమ బాధ్యతగా వ్యవహరిస్తూ పోలీస్ అధికారులకు సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎంతోమంది జిల్లా నలుమూలల నుండి ప్రతి సోమవారం పెద్ద ఎత్తున పోలీస్ బాస్ కు తమ బాధలను మొరపెట్టుకుంటున్నారు.
నిజామాబాదు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేశారు.
సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ ల యొక్క ఎస్.ఐ మరియు సి.ఐ లకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని మరియు పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.
ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ, వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకొనేల, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని సిపి స్పష్టం చేశారు. ప్రజా సమస్యలు పై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నాము అని తెలిపారు.వివిధ ఫిర్యాదులకు సంబందించిన 14 ఫిర్యాదు లను స్వీకరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular