Thursday, February 12, 2026

సైబర్ నేరాలపై ప్రజల అప్రమత్తంగా ఉండాలి

కోటగిరి ఆగస్టు 5 ద్రోణ

సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరాలు ఎక్కడైనా జరిగితే వెంటనే పోలీసులు ఫిర్యాదు చేస్తే వారి భరతం పడతామని కోటగిరి ఎస్సై సునీల్ ఒక ప్రకటనలో హెచ్చరించారు.
సైబర్ క్రైమ్ లో డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తికి తిరిగి ఇప్పించారు. కేసు యొక్క వివరాలు ఏమనగా ఏప్రిల్ మూడో తేదీ 2025 రోజున కోటగిరి గ్రామానికి చెందిన పాకల నడిపి సాయిలు అనే వ్యక్తికి అనుమానాస్పద లింక్ మెసేజ్ రాగా అట్టి మెసేజ్ ను అతను ఓపెన్ చేశాడు. దానివలన అతని యొక్క సిమ్ స్వాప్ చేసి అతనికి వచ్చే మెసేజ్లు వేరే నెంబర్ కు వెళ్లేలా చేసి అతని బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఇట్టి విషయమే ఫిర్యాది పాకల నడిపి సాయిలు పోలీసులకు తెలుపగా సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా అతనికి ఐదువేల రూపాయలు తిరిగి ఇప్పించగలిగారు.
ప్రజలు అందరూ వారికి వచ్చే అనుమానస్పద లింకులు ఓపెన్ చేయవద్దని మరియు కొత్త నెంబర్ నుండి వచ్చే అనుమానాస్పద అప్లికేషన్లు ఇన్స్టాల్ చేసుకోవద్దని, ఏదైనా జరిగి డబ్బులు పోగొట్టుకున్నట్లయితే వెంటనే 1930 కి కాల్ చేసి గాని లేదా సైబర్ క్రైమ్ పోర్టల్ లో గాని ఫిర్యాదు చేయాలని కోటగిరి ఎస్సై సునీల్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular