స్వంత డబ్బులతో స్థలాన్ని కొనుగోలు చేసిన ఎమ్మెల్యే యశస్విని కుటుంబ సభ్యులు
పాలకుర్తి ఆగస్టు 5 ద్రోణ
పేదల కలలు నెరవేర్చడమే తమ కుటుంబ సభ్యుల లక్ష్యమని టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్నారు. పేదలకు సేవలందించడంలో ఎంతో ఆత్మ సంతృప్తిని పొందగలుగుతామన్నారు. ప్రతి ఒక్కరు తమ సంపాదనలో ఎంతో కొంత పేదలకు సేవలను అందించాలని ఆమె తెలుపునిచ్చారు. ఆనాడు భూమి మీద గొడవలు చేసి పేదల కలలు నెరవేర్చేందుకు నడుము బిగించి నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన ఇద్దరమ్మాయిలను నిర్మించుకునే విధంగా చేయగలిగామని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఉచితంగా అందించిన స్థలంలో పేదలకు జిల్లా నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఆ ప్రాంగణంలో ముఖద్వారం ఏర్పాటు కార్యక్రమానికి వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చెర్లపాలెం గ్రామంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సి రాజేందర్ రెడ్డి 2017లో తమ స్వంత డబ్బులతో రెండు ఎకరాల భూమిని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం కొనుగోలు చేసి ప్రభుత్వానికి అందజేశారు. గ్రామంలోని పేద ప్రజలకు స్థిర నివాసం కల్పించాలని వారు నిబద్ధతతో తీసుకున్న ఈ నిర్ణయం ఆపై ప్రభుత్వం మంజూరు చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి పునాదిగా నిలిచింది.ఈ క్రమంలో ఇండ్లలోకి వెళ్లే ప్రధాన రహదారి ప్రవేశద్వారాన్ని (ముఖద్వారం) టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సి రాజేందర్ రెడ్డి ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. ఈ ముఖద్వారాన్ని మంగళవారం ప్రారంభించిన పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రాజరామ్మోహన్ రెడ్డి దంపతులు, ఝాన్సి రాజేందర్ రెడ్డి దంపతులు, మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జెన్నారెడ్డి భరత్ చంద్ర రెడ్డి పాల్గొన్నారు. వారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవాన్ని జరిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ పేదలకు ఇళ్ల కలను నెరవేర్చడంలో మా అత్త మామా ఝాన్సి రాజేందర్ రెడ్డి త్యాగం అపూర్వం. రాజకీయాల్లో లేని రోజుల్లోనే అనేక సేవ కార్యక్రమాలు చేశారు. ఒక నాయకుడు పదవికి పరిమితమవకుండా ప్రజల అవసరాలను గుర్తించి తమ సంపాదనను ప్రజలకోసం ఖర్చు చేయడం ఎంతో అరుదైన విషయం. ఈ ముఖద్వారం గ్రామానికి ఒక గుర్తింపుగా నిలుస్తుంది అని అన్నారు.టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ మా ఊరిలో పేదల కోసం కాస్త సహాయం చేయాలని చిన్నపుడు తీసుకున్న సంకల్పమే నేడు ఇలా రూపుదిద్దుకుంది. ప్రభుత్వం భూమి లేకపోవడంతో ఇబ్బందులు ఎదురైన తరుణంలో మా వంతు కర్తవ్యంగా భావించి ఈ భూమిని కొని ఇచ్చాము అని చెప్పారు.
జిల్లా అధ్యక్షులు జెన్నారెడ్డి భరత్ చంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ* ఝాన్సి రాజేందర్ రెడ్డి సేవలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలో ఉన్నాయి, వారు చాలా గొప్పవారు, అనునిత్యం పెదలకోసం తపిస్తుంటారు, సేవాభావం ప్రతి నాయకుడికి ప్రేరణగా నిలవాలి. ఇది కాంగ్రెస్ పార్టీ తత్వాన్ని ప్రతిబింబించే విషయం. పేదల పట్ల మాకు ఉన్న కర్తవ్యబద్ధతకు ఇది చక్కటి ఉదాహరణ అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, పట్టణ నాయకులు, గ్రామ నాయకులు, గ్రామస్తులు, మహిళా సంఘాల ప్రతినిధులు, యువజన నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమం గ్రామ ప్రజల సందడితో ఉత్సాహంగా సాగింది.



