టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ
పాలకుర్తి ఆగస్టు 5 ద్రోణ
బోనాల పండుగ తెలంగాణ రాష్ట్రం ఆరాధన సాంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుందని, బోనాల మహిళల భక్తిశ్రద్ధలకు ప్రతిరూపంగా నడుస్తుందని, భవిష్యత్ తరాలకు బోనాల ప్రత్యేకతను చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్రెడ్డి అన్నారు.
కొడకండ్ల మండల కేంద్రంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన బోనాల పండుగలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సి రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి బోనం ఎత్తి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులు, మహిళలు, యువత పెద్దఎత్తున పాల్గొన్న ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.బోనాల పండుగ తెలంగాణ రాష్ట్రం యొక్క ఆరాధనా సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుందని, ఇలాంటి పండుగలు సాంప్రదాయాలను కొత్త తరాలకు పరిచయం చేస్తాయనే విషయాన్ని ఈ సందర్భంగా ఝాన్సి తెలిపారు. మహిళల భక్తి శ్రద్ధలకు, సమాజంలో వారి పాత్రకు బోనాల పండుగ ప్రతిరూపమని పేర్కొన్నారు.బోనం ఊరేగింపు సందర్భంగా డప్పు చప్పుళ్లతో గ్రామమంతా మార్మోగింది. కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరినీ స్వయంగా కలిసి అభినందించిన ఝాన్సి రాజేందర్ రెడ్డి ని గ్రామస్థులు ఘనంగా స్వాగతించారు.
కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, యువజన నాయకులు, గ్రామ పెద్దలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.





