Thursday, February 12, 2026

గిరిజన రైతుల పంట పొలాలపై పోలీసుల వేట

గడ్డి మందు తాగిన గిరిజన రైతు

నిజామాబాద్ (ఆగస్టు 7) ద్రోణ

పంటను నాశనం చేసిన ఫారెస్ట్ అధికారులు వెంటనే సస్పెండ్ చేయాలని వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి గిరిజనులపై తిరగబడ్డందుకు తక్షణమే వారిని విధుల నుండి తొలగించాలని పంటను నాశనం చేసిన వారికి నష్టపరిహారం చెల్లించాలి గిరిజన రైతుల డిమాండ్ చేశారు. గిరిజన రైతులు సాగు చేసుకుంటున్నా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మూడవ నెంబర్ నాయక్ రాష్ట్ర అధ్యక్షుడు లంబాడి హక్కుల పోరాట సమితి ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల బైరాపూర్ గ్రామ పరిధిలోని మోతీ నాయక్ తండాలో అటవీ అధికారులు గిరిజనులను సాగు చేసుకుంటున్నా పోడు భూముల పట్టాల పై డాక్టర్లతో దున్ని మక్కజొన్న చేనుల పైన గడ్డి మందును చల్లి పంట నాశనం చేశారు లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని ప్రకాష్ నాయక్ అనే రైతు తనను సాగు చేసుకుంటున్నా పట్టా భూమి ఆన్లైన్లో ఉంది, కానీ అధికారులు ఇది ఫారెస్ట్ భూమిలో మొక్కజొన్న పంటను వేశానని అటవీశాఖ అధికారులు గుంపులు గుంపులుగా పోలీసులతో వచ్చి రైతుకులకు చెప్పకుండా హడావుడిగా గిరిజన రైతుల పంట పొలాలలో గడ్డి మందును పిచికారి చేసి రైతులపై దాడి చేశారు. తన పంట పొలంలో గడ్డి మందును చల్లడంతో ఆవేదనతో ప్రకాష్ నాయక్ అధికారుల నుండి గడ్డి మందును తీసుకొని త్రాగడం జరిగింది అక్కడే ఉన్న తాండ పెద్దమనుషులు, రైతులు హుటా హుటీగా ప్రభుత్వ దౌఖానాకు తీసుకువెళ్లడం ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వం మేము పోడు భూములకు పట్టాలు ఇస్తాం వారి జోలికి వెళ్ళవద్దు అంటూనే అధికారులు అతి ఉత్సాహంతో గిరిజనులను సాగు చేసుకుంటున్నాము భూములను స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చుట్టుపక్కల మండలాలలో గిరిజన రైతులు సాగు చేస్తున్నటువంటి భూములపైన కూడా దాడులు చేసి రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు తక్షణమే ఇలాంటి పనులు మానుకోవాలని ఫారెస్ట్ అధికారులను హెచ్చరిస్తూ గిరిజనుల జోలికి వస్తే ఊరుకునేది లేదు రాబోయే రోజులలో తగిన గుణపాఠం చెప్ప వలసి ఉంటుందని జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క వెంటనే గిరిజన రైతులు సాగు చేసుకుంటున్నా వారి జోలికి అధికారులు వెళ్లకుండా ఆపాలని భూములకు పట్టాలు ఇవ్వాలని లేదంటే గిరిజన రైతులు అందరూ ఏకధాటిపై ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని అన్నారు. హాస్పటల్ కు తరలించినటువంటి గిరిజన రైతు ప్రకాష్ నాయక్ కు మంచి చికిత్స అందించాలని లేనియెడల అధికారులను కోరుకునేది లేదని గిరిజన బిడ్డ సీతక్క మీరు నిజామాబాద్ జిల్లా ఇంఛార్జి గా ఉన్న హయాంలోనే గిరిజన రైతులకు న్యాయం చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తుంది. లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకుడు మూడవత్ రాంబాల్ నాయక్ డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టవలసి ఉంటుందని హెచ్చరించాడు. ఈ విషయంలో ఊరంతా కదలి వస్తుందని పోలీసులను వెంటనే శిక్షించాలని గ్రామ ప్రజలు రాస్తారోకో చేపట్టారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular