మాజీ మంత్రి మండవ
బోధన్ (ఆగస్టు 9) ద్రోణ
పేద విద్యార్థులకు హాస్టల్ వసతితో ఉచిత విద్యా బోధనను అందించడం అభినందనీయమని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు అన్నారు.కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వంటశాలను శనివారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు.కమ్మ సంఘం అధ్యక్షులు పల్లెంపాటి శివన్నారాయణ అధ్యక్షతన ఎస్ కేసిసిటీ సభ్యులు మరియు కాకతీయ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు సతీమణి నళిని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మండవ వెంకటేశ్వరరావు 70వ జన్మదినాన్ని పురస్కరించుకొని విద్యార్థులు ఆయనకు పుష్పగుచ్చం అందించి ఆయన ఆశీస్సులు పొందారు.కమ్మ సంఘం ప్రతినిధులు, ఎస్కేసిసిటీ సభ్యులు,ట్రస్ట్ సభ్యులు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు.జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అందరికీ రక్షాబంధన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు.పేద విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు హాస్టల్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అలాగే కమ్మ సంఘం కూడా ఎంతో తొందరగా అభివృద్ధి చెందడం అనేది సంతోషంగా ఉందని ఇలాంటి సేవా కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు అందించడానికి ఎల్లవేళలా సహకరిస్తానని హామీ ఇచ్చారు.ట్రస్టు ద్వారా సామాజిక ఉపయోగాల కార్యక్రమాలను ప్రణాళిక బద్ధంగా నిర్వహించాలని సూచించారు.ఇంత పెద్ద మొత్తంలో కమ్మ సంఘం ఏర్పాటు,కాకతీయ ట్రస్టు స్థాపన సంతోషదాయకమన్నారు. 4 వేల మందికి భోజనాలు ఏర్పాటు చేయడానికి సౌకర్యం కల్పించడం హర్షించ దగ్గ విషయం అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రంగారావు,ఎస్ కెసిసిటి హరినాథ్ బాబు,కార్యదర్శి శ్రీధర్,కోశాధికారి, న్యాయవాది హనుమంతరావు, డాక్టర్ సునీల్ కుమార్ చౌదరి, రంగారావు, శ్రీను,మండవ వెంకటేశ్వరరావు,కమ్మ సంఘం ప్రతినిధులు,విద్యార్థుల తల్లిదండ్రులు,ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.



