Thursday, February 12, 2026

రేవంత్ ఇంట రక్షాబంధన్ సంబరాలు

హైదరాబాద్‌ ఆగస్టు 9 ద్రోణ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సి రాజేందర్ రెడ్డి . ఈ సందర్భంగా ఝాన్సి రాజేందర్ రెడ్డి ముఖ్యమంత్రికి తిలకధారణ చేసి, రాఖీ కట్టి, ఆయురారోగ్యాలు, సర్వాంగ సౌఖ్యం కలగాలని ఆకాంక్షించారు. అనంతరం మిఠాయిలు తినిపించి సోదరభావాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆప్యాయంగా “ఝాన్సి అక్క బాగున్నవా? అని అడిగి, రాఖీ పండుగ శుభాకాంక్షలు అందించారు. రాఖీ పండుగ సోదరుడు–సోదరి అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని, ఇది పరస్పర ప్రేమ, రక్షణ, విశ్వాసానికి ప్రతీక అని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, సౌభ్రాతృత్వంతో జీవించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular