Thursday, February 12, 2026

మంత్రి కోమటిరెడ్డికి రాఖీ కట్టిన ఝాన్సీ రెడ్డి

హైదరాబాద్ ఆగస్టు 9 ద్రోణ

రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి రాఖీ కట్టిన టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి . ఈ సందర్భంగా మంత్రి కి తిలక ధారణ చేసి, ఆప్యాయంగా రాఖీ కట్టి, ఆయురారోగ్యాలు, సర్వాంగ సౌఖ్యం కలగాలని ఆకాంక్షించారు. సహోదరుడు సహోదరి బంధానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగలో భాగంగా మంత్రి కి మిఠాయిలు తినిపించారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, రాఖీ పండుగ అనేది మనసును కలిపే, కుటుంబ బంధాలను బలపరిచే అందమైన ఆచారం అని, అక్కా చెల్లెళ్ల ఆశీస్సులు ఎల్లప్పుడూ తనతో ఉంటాయని తెలిపారు. దేశంలో సౌహార్దం, శాంతి నెలకొని అందరూ సుఖసంతోషాలతో జీవించాలనే సంకల్పాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular