Thursday, February 12, 2026

రాఖీ పండుగ సందర్భంగా సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి కి రాఖీ కట్టిన ఝాన్సీ

హైదరాబాద్ ఆగస్టు 9 ద్రోణ

రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి రాఖీ కట్టిన టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి . ఈ సందర్భంగా వారితో పాటు వారి భర్త డాక్టర్ రాజేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.రాఖీ కట్టిన అనంతరం ఝాన్సీ రాజేందర్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి కి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయురారోగ్యాలు, సర్వాంగ సౌఖ్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంలో వేం నరేందర్ రెడ్డి కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నరేందర్ రెడ్డి కూడా ఝాన్సీ రాజేందర్ రెడ్డి ని ఆప్యాయంగా పలకరించి, రాఖీ పండుగ శుభాకాంక్షలు అందించారు.
రాఖీ పండుగ సోదరుడు–సోదరి అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని, ఈ బంధం పరస్పర విశ్వాసం, ప్రేమ, రక్షణకు సంకేతమని అందరూ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular