Thursday, February 12, 2026

ముఖ్యమంత్రి ఇంట రక్షాబంధన్

హైదరాబాద్ ఆగస్టు 9 ద్రోణ

రక్షా బంధన్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో సందడి నెలకొంది. మహిళా మంత్రులు, ఇతర ప్రతినిధులు పెద్దఎత్తున తరలిరావడంతో రాఖీ పండుగ కోలాహళంగా సాగింది. మంత్రులు కొండా సురేఖ , ధనసరి అనసూయ సీతక్క ముఖ్యమంత్రి కి రాఖీ కట్టారు. మాజీ మంత్రి డాక్టర్ గీతా రెడ్డి ముఖ్యమంత్రి కి రాఖీ కట్టి ఆశీర్వదించారు. వీరితో పాటు మరెందరో సోదరీమణులు రాఖీ కట్టారు.
ఈ వేడుకలో పాల్గొన్న బ్రహ్మకుమారీ సమితి సోదరీమణులు ముఖ్యమంత్రి ని కలిసి రాఖీ కట్టారు. మలక్ పేట ప్రభుత్వ అంధ బాలికల పాఠశాల విద్యార్థినులు ముఖ్యమంత్రి ని కలిసి ఆప్యాయంగా రాఖీ కట్టారు.
అలాగే, మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద , వైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత , బీసీ కమిషన్, విద్యా కమిషన్, శిశు సంక్షేమాభివృద్ధి కమిషన్, రైతు కమిషన్ కు చెందిన మహిళా ప్రతినిధులు, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు తో పాటు మహిళా ప్రతినిధులు రేవంత్ రెడ్డి కి రాఖీ కట్టారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular