ఎల్లారెడ్డి ఎమ్మెల్యే
ఎల్లారెడ్డి ఆగస్టు 10 ద్రోణ
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ స్పష్టం చేశారు.
గాంధారి మండలం గండివేట్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన హై మాక్స్ లైట్లను ఎమ్మెల్యే ఆదివారం ప్రారంభించారు. అనంతరం గ్రామంలో జానీ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరై నిర్మాణం జరుగుతున్న గృహాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా జానీ కుటుంబ సభ్యులు మాకు ఇల్లు మంజూరు చేసి, మా కుటుంబ సొంత ఇంటి కలను నెరవేర్చిన ఎమ్మెల్యే మదన్ మోహన్ కి మరియు సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. బిల్లులు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతున్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేయడం లక్ష్యం. ఇందుకోసం గ్రామ పంచాయతీ సెక్రటరీలతో మీటింగ్‌లు నిర్వహించి పనుల పురోగతిపై నివేదికలు తీసుకుంటున్నాను అన్నారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలతో పేద ప్రజల సొంత ఇంటి కల సాకారం అవుతుంది. మరిన్ని ఇళ్లు మంజూరు కావడానికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ కృషి చేస్తానుఅని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ లు, గాంధారి పట్టణ అధ్యక్షులు, మండల సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గండివేట్ గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




