Thursday, February 12, 2026

దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా సాగునీరును అందిస్తాం

ప్రభుత్వానికి అత్యంత ప్రాముఖ్యమైన ప్రాజెక్టు దేవాదుల

దేవాదుల ప్రాజెక్ట్ తో రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తాం

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం దేవాదుల ప్రాజెక్ట్ ప్రాంగణంలో జె. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనుల పురోగతిపై దేవాదుల ప్రాజెక్ట్ అధికారులతో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దనసరి అనసూయ సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి, ఎంపి, ఎమ్మెల్యేలతో కలిసి డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
దేవాదుల ప్రాజెక్ట్ ప్రభుత్వానికి అత్యంత ప్రాముఖ్యమైన ప్రాజెక్ట్ అని, ప్రాజెక్ట్ పరిధిలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఆయకట్టుకు సాగునీరును అందిస్తామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు.
ఆదివారం ములుగు జిల్లా కన్నాయీగూడెం మండలం దేవాదుల ప్రాజెక్ట్ ప్రాంగణంలో జె. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనుల పురోగతిపై దేవాదుల ప్రాజెక్ట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్ట్ అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్17 నియోజకవర్గాల పరిధిలో ఆయకట్టుకు త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశ్యం తో ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. 67 కోట్ల తో భూసేకరణ చేపట్టనున్నామని తెలిపారు. దశల వారిగా నిధులను విడుదల చేస్తామన్నారు. 71 మీటర్ల తో 17 నియోజకవర్గాలకు సాగునీరందిస్తామని అన్నారు.
ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి, పెండింగ్ బిల్లులు కలిపి మొత్తం వంద కోట్ల రూపాయలు ఉన్నాయని, విడతాలవారీగా విడుదల చేస్తామని, ఇందుకు సంభందించిన వివరాలను అధికారులు వెంటనే పంపాలని అధికారులను సూచించారు.రైతులకు ఇబ్బందులు రాకుండా
ఏడాదిలో రెండు సీజన్లకు సాగు నీటిని ఈ ప్రాజెక్టు ద్వారా అందించాలని, అందుకు తగినవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడు 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా నిర్మాణం చేపట్టినా మరింత పెరిగి ప్రస్తుతం ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తోందని, సాగు నీటి ఆయకట్టు ఇంకా పెరిగే అవకాశం ఉందనీ అన్నారు.ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పూర్తి చేయుటకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
అలాగే పెరిగిన ఆయకట్టుకు కూడా నీరు అందించేలా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు.గతంలో ఇక్కడ 38 టీఎంసీల స్సామర్థ్యం ఉండగా
ఇప్పుడు 78 నుంచి 80 టీఎంసీల అవసరం అవుతుందని, ఇరిగేషన్ మంత్రి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని అన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర సాగునీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్ట్ అన్ని దశలను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఛత్తిస్ గడ్ ప్రభుత్వ సాగునీటి పారుదల శాఖ మంత్రి కశ్యప్ తో చర్చలు జరుపుతున్నామని, ఛత్తీస్ గడ్ పరిధిలోని ముంపు ప్రాంతాలకు పరిహారం చెల్లించేందుకు మాట్లాడినట్లు పేర్కొన్నారు. దేవాదుల ప్రాజెక్ట్ పరిధిలో ఇంకా భూసేకరణ పూర్తికాని చోట్లా ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడాలని సాగునీటి పారుదల శాఖ సీఈ వెంకటేశ్వర్లు ను ఆదేశించారు. భూసేకరణ పూర్తయిన చోట్లా పరిహారం చెల్లింపులు చేసేందుకు, భూసేకరణ పనులు మొదలు పెట్టేందుకు నిధులు విడుదల చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
సమీక్షా సమావేశం లో చర్చించిన అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకొని సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు.
నీటి పారుదల శాఖ అధికారులు చిత్త శుద్దితో , నిజాయితీ తో పూర్తి సమర్ధత తో పని చేయాలనీ అన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్ట్ పై ఇక్కడ సమీక్ష నిర్వహించడం రెండోసారి అని అన్నారు. పక్కనే గోదావరి ఉన్నా కన్నాయీగూడెం ప్రాంతం లో సాగునీరు అందడం లేదన్నారు. దేవాదుల ద్వారా రామప్ప చెరువు నిండితే ములుగు లోని పలు ప్రాంతాలు ముంపునకు గురవుతాయాన్నారు.
తుపాకులగూడెం బ్యారేజ్ దేవాదుల బ్యారేజ్ నిర్మాణం కొరకు భూమి కోల్పోయిన రైతులకు మానవీయ కోణంలో ఆలోచించి తగినంత నష్టపరిహారం అందించాలన్నారు. మంగపేట, కన్నాయిగూడెం, ఏటూరు నాగారంలలో కెనాల్స్ పై ఏర్పాటు చేసిన లిస్టులో సరిగా పనిచేయక తాగునీరు అందడం లేదన్నారు. పాకల ద్వారా నర్సంపేటకు నీరందిస్తూ కొత్తగూడెం కూడా సాగునీరు అందించేలా ప్రణాళిక చేయాలని కోరారు. పేదరికాన్ని తగ్గించడానికి సాగునీరు పెంచడమే పదమ కర్తవ్యమని అన్నారు.
ములుగు జిల్లా కు సంపూర్ణంగా సాగునీరు అందించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ త్వరలోనే సీతక్క చెప్పిన సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
సమీక్షా సమావేశం లో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్ర పశు సంవర్ధక, శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి, వారి వారి నియోజకవర్గాల పరిధిలో ఆయకట్టు విస్తీర్ణం, సాగునీటిపారుదల అంశాలను డిప్యూటీ సీ ఎం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.
వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలో ఉన్న ఆఖరు ఆయకట్టుకు దేవాదుల నీరు అందించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కోరారు.
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ మాట్లాడుతూ భీం ఘన్ పూర్ రిజర్వాయర్ కు సాగునీరు వచ్చేట్టు చర్యలు చేపట్టాలని కోరారు. దేవాదుల ప్రాజెక్ట్ కు సంబంధించిన వివిధ దశలు, ఇప్పటి వరకూ పూర్తయిన వివిధ దశల పనులు, భూసేకరణ, తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సాగునీటిపారుదల శాఖ సీఈ వెంకటేశ్వర్లు వివరించారు.
ముందుగా మంత్రులు సమక్క సాగర్ ప్రాజెక్ట్ ను సందర్శించి, గంగారం లోని దేవాదుల ఇంటెక్ పంప్ హౌస్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
దేవాదుల పంపు హౌజ్ వద్ద మల్లంపల్లి మండల కొడిశల కుంటలో రూ. 2.7కోట్లతో చేపట్టిన 33/11 కెవి విద్యుత్తు ఉప కేంద్రం ను శిలా ఫలకాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ఇతర మంత్రులతో కలిసి ప్రారంభించారు. అదేవిధంగా ములుగు మండలంలోని గట్టమ్మ, బండారుపల్లి, జగ్గన్నపేట, లింగాల, నార్లపూర్, రొయ్యురు, బుచ్చంపేట లలో రూ. 20.73 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కెవి విద్యుత్ ఉప కేంద్రాలకు శంకుస్థాపన చేశారు.సమీక్షా సమావేశం అనంతరం తుపాకులగూడెం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద నుండి హెలికాప్టర్ లో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకాటి శ్రీహరి లు హైదరాబాద్ కు బయలుదేరారు.
మంత్రుల పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలో మంత్రుల పర్యటన ప్రశాంతంగా ముగిసింది.
ఈ సమావేశంలో ములుగు కలెక్టర్ దివాకర టీ.ఎస్., ములుగు ఇంచార్జీ భూపాలపల్లి ఎస్పీ కిరణ్ కారే, హనుమకొండ, వరంగల్ జిల్లాల అదనపు కలెక్టర్లు వెంకట్ రెడ్డి, సంధ్యారాణి, ఆర్డీవో లు సత్యపాల్ రెడ్డి వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడకుల అశోక్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి
ఇరిగేషన్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు
ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular