Thursday, February 12, 2026

దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి రైతులను ఆదుకోవాలి

హైదరాబాద్ ఆగస్టు 10 ద్రోణ

ములుగు జిల్లా తుపాకుల గూడెం వద్ద దేవాదుల పంపు హౌస్ వద్ద రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన జే. చొక్కారావు దేవాదుల ప్రాజెక్ట్ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకాటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ తో కలిసి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు దొంతి మాధవ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు, కేఆర్. నాగరాజు, మురళి నాయక్, స్పెషల్ సెక్రెటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ
దేవాదుల ప్రాజెక్ట్ పై ప్రత్యేక ద్రుష్టి పెడుతున్న నీటి పారుదల శాఖ మంత్రి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.దేవాదుల ప్రాజెక్ట్ కింద ఆయకట్టు గణనీయంగా పెరిగిందన్నారు.
పెరిగిన ఆయకట్టు కు సరిపడా నీటి కేటాయింపులు లేవు.
ప్రస్తుతం దేవాదులకు 38 టిఎంసిల కేటాయింపులు ఉన్నాయి. దానిని 80 నుండి 100 టిఎంసీలకు పెంచాలి.
వీలైనంత తొందరలో CWC తో చర్చించి నీటి కేటాయింపులు పెంచే ప్రయత్నం చేయాలి.
దీనిని అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకొని నీటి కేటాయింపులు పెంచాలి.
నీటిని ఎత్తిపోయడానికి వాడుతున్న మోటార్లు పాత పడడం వల్ల తరచూ సమస్యలు ఎదురవుతున్నాయి.
మోటర్ల సమస్యల వల్ల పూర్తి స్థాయిలో నీటిని పంపు చేయలేకపోతున్నాం.
పంపుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దశల వారీగా పంపుల నిర్వహణ మరమ్మత్తులు చేపట్టాలి.
3వదశలోని ప్యాకేజీ 6 పనులను వెంటనేపూర్తి చేయాలి.ప్యాకేజీ 6కింద స్టేషన్ ఘనపూర్, వర్దన్నపేట, పాలకుర్తి, తుంగతుర్తి నియోజకవర్గాలలో 78వేల ఎకరాలకు సాగు నీరు అందించాల్సి ఉంది.
కావున 3వ దశలోని ప్యాకేజి 6పనులను పనులను వెంటనే పూర్తి చేయాలి.భూసేకరణ సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలి.
దీనిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ
దేవాదుల ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతలో తీసుకుందని తెలిపారు. వీలైనంత తొందరలో దేవాదుల ప్రాజెక్ట్ పనులను పూర్తి చెస్తామని అన్నారు. దేవాదుల ప్రాజెక్ట్ భూ సేకరణ పనులను వెంటనే పూర్తి చేస్తామని, భూ సేకరణ పై జిల్లా కలెక్టర్లు వెంటనే పూర్తి స్థాయి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలని ఆదేశించారు. భూ సేకరణలో న్యాయ పరమైన సమస్యలు వెంటనే పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దేవాదుల పనులలో జాప్యం జరగడానికి బిఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ అధికారులు, ఇతర శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular