Thursday, February 12, 2026

బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి తీరాలి

ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్ ఆగస్టు 11 ద్రోణ

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి బహిరంగ సభలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆశ చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసి అమలు చేయాలని ఎమ్మెల్సీ కవిత జాగృతి అధ్యక్షురాలు డిమాండ్ చేశారు.తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ నాయకులు, ఇతర బీసీ నాయకులతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం సమావేశం అయ్యారు.
కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా బీసీలను వంచించాలని చూస్తోంది,రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాకే బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం అంటే బీసీ రిజర్వేషన్లు ఇప్పటికీ అమలు చేయమని చెప్పడమే ఇదే విషయం అసెంబ్లీ ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు? అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి గద్దెనెక్కిన తర్వాత బీసీలను వంచించాలనే చూస్తోన్న కాంగ్రెస్ కుయుక్తులను ప్రజల ముందు ఎండగడుతాం అని హెచ్చరించారు.పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అనేది కంటితుడుపు చర్య మాత్రమే ఎందుకు ప్రధాని దగ్గరకు అఖిలపక్షం తీసుకెళ్లడం లేదు.
ప్రధాని తో సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న లాలూచీ ఏంటి?
బీసీ రిజర్వేషన్ల సాధన కోసం త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తాం.కలిసి వచ్చే అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్తామని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular