సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ ఆగస్టు 11 ద్రోణ
దేశ రాజధాని దిల్లీలో కుక్క కాటు కేసులు పెరిగిపోతున్న వేళ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
వీలైనంత త్వరగా డాగ్ షెల్టర్లు ఏర్పాటు చేసి వాటిని తరలించాలని సూచించింది.
ఏదైనా సంస్థ లేదా వ్యక్తులు వీధి శునకాలను తీసుకెళ్లకుండా అడ్డుకుంటే తదుపరి చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
వీధి కుక్కల బెడద చాలా దారుణంగా ఉందన్న సుప్రీంకోర్టు, ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలను జారీ చేస్తున్నట్లు పేర్కొంది.
దిల్లీ ప్రభుత్వం సహా స్థానిక యంత్రాంగాలు కలిసి ఈ డాగ్ షెల్టర్లను ఏర్పాటు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.
ఆ డాగ్ షెల్టర్లలో తగినంత సిబ్బందిని ఉంచి స్టెరిలైజేషన్, ఇమ్యునైజేషన్ ప్రక్రియలను సత్వరమే చేపట్టాలని నిర్దేశించింది.పరిస్థితి చాలా భయంకరంగా ఉందన్న సుప్రీం, తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది
అన్ని వీధుల నుంచి శునకాలను వెంటనే తీసుకెళ్లడం ప్రారంభించాలని సూచించింది.అయితే ఈ ప్రక్రియ ఎలా నిర్వహించాలో? అధికారులు నిర్ణయించుకోవచ్చని సూచించింది.
వాటిని తిరిగి వీధులు, కాలనీలలో విడుదల చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
వీధి శునకాలను తీసుకెళ్లకుండా ఎవరైనా అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.
శిశువులు, చిన్నారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వీధికుక్కల బారిన పడకూడదని పేర్కొంది.
వీధికుక్కల తరలింపు ప్రదేశాలపై జస్టిస్ పార్దివాలా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయాన్ని కోరారు. అందుకోసం ఇప్పటికే ఓ ప్రదేశాన్ని గుర్తించారని తెలిపారు.
అయితే, జంతు హక్కుల కార్యకర్తలు స్టే ఆర్డర్ పొందడం వల్ల అది నిలిచిపోయిందని వివరించారు. దీంతో ఆగ్రహించిన ధర్మాసనం రేబిస్ తో చనిపోయినవారిని జంతు ప్రేమికులందరూ కలిసి తిరిగి తీసుకురాగలుతారా? అంటూ ప్రశ్నించింది.
వీధి కుక్కలను దత్తత తీసుకోవడానికి కూడా ఎవరికీ అనుమతి ఇవ్వొద్దని అన్నారు.
కుక్కల కోసం వెంటనే షెల్టర్లను నిర్మించాలని అధికారులను ఆదేశించారు.
వీధి కుక్కులను దత్తత తీసుకోవడానికి కూడా అనుమతించబోమని కూడా పేర్కొంది
కుక్క కాటు కేసులను నివేదించడానికి వారంలోపు ఒక హెల్ప్ లైన్ ను ప్రారంభించాలని పౌర అధికారులకు సూచించింది
దేశంలో వీధి కుక్కల బెడదపై మీడియాలో వచ్చిన కథనాలకు సుప్రీంకోర్టు స్పందించి, ఈ అంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది
జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్‌తో కూడిన ధర్మాసనం విచారణను చేట్టింది
అయితే ఈ విషయంపై కేంద్రం నుంచి మాత్రమే వాదనలు వింటామని జంతు ప్రేమికులు లేదా మరే ఇతర పార్టీల నుంచి వచ్చిన పిటిషన్లపై విచారించలేమని స్పష్టం చేసింది
ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలను జారీ చేశామని ధర్మాసనం పేర్కొంది
