Thursday, February 12, 2026

వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం

ఉప ముఖ్యమంత్రి బట్టి

హైదరాబాద్ ఆగస్టు 11 ద్రోణ

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి బట్టి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు వ్యవసాయాన్ని విస్మరించాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని పరిశ్రమలకు దీటుగా తీర్చిదిద్ది, ఉన్నత విద్యను అభ్యసించిన యువత సైతం వ్యవసాయం వైపు నేడు ముగ్గు చూపుతోందన్నారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల కేంద్రంలో మూడు 33/11 కేవీ సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.
నవాబ్‌పేట మండలంలోని నారెగూడ గ్రామంలో ₹2.40 కోట్లతో, మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో ₹8 కోట్లతో,
భాకారం-నాగిరెడ్డిగూడెం గ్రామాలలో ₹10 కోట్ల వ్యయంతో ఈ సబ్‌స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. రేషన్ కార్డుల పంపిణీ, రైతులకు ట్రాన్స్‌ఫార్మర్ల అందజేత కార్యక్రమంలో పాల్గొని, అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular