Thursday, February 12, 2026

బోధన్ ఉర్సు ఉత్సవాల్లో సిపి

బోధన్ ఆగస్టు 11 ద్రోణ

సోమవారం రాత్రి సమయంలో బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెంజల్ బేస్ సమీపంలో గల జలాల్ భుఖారి దర్గా ఉర్సు ఉత్సవాల్లో నిజాంబాద్ జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య పాల్గొన్నారు. గత మూడు రోజుల నుంచి ఉరుసు ఉత్సవాలు కొనసాగుతున్నాయి.ఈ కార్యక్రమానికి సోమవారం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, పరివేక్షించారు. ఈ సందర్భంగా ఉర్సు ఉత్సవాలు మరియు ఖవ్వాలి కార్యక్రమంలో పాల్గొని చాదర్ సమర్పించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజలందరూ సోదరా భావంతో మెలగాలని మరియు ప్రతి ఒక్కరు ఎల్లప్పుడూ పోలీసు వారికి సహకరించాలని తెలియజేశారు.ఈ సందర్భంగా బోధన్ ఏసిపి శ్రీనివాస్ , బోధన్ టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ , రుద్రూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ , బోధన్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయబాబు మరియు ఎస్సైలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular