నేషనల్ హైవే రోడ్డును పరిశీలించిన కలెక్టర్, సిపి
నిజామాబాద్ ఆగస్టు 13 ద్రోణ
నేషనల్ హైవే రహదారుల్లో ప్రమాదాలను నివారించేందుకు అన్ని చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఉన్నతాధికారులు నేషనల్ హైవే 63 రహదారిలో ఉన్న ప్రమాదకర ప్రదేశాల్లో మంగళవారం పరిశీలించారు.
మొత్తం 26 బ్లాక్ స్పాట్లను గుర్తించి సంబంధిత అధికారులతో పర్యవేక్షించిన అధికార యంత్రాంగం.
NH63లో బ్లాక్ స్పాట్‌గా గుర్తించిన ప్రమాదకర ప్రాంతాలను స్వయంగా పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ మరియు నిజామాబాదు పోలీస్ కమిషనర్.
ఈ మధ్య కాలంలో నిజామాబాదు పోలీస్ కమీషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో, అట్టి రోడ్డు ప్రమాదల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తల కోసం నేడు నిజామాబాదు పోలీస్ కమీషనరేట్ పరిధిలోని NH 63 కమర్ పల్లి నుండి బోధన్ వరకు గల 77 కిలోమీటర్లు పరిధిలో గల రోడ్డు ను పోలీస్ శాఖ, R&B శాఖ, NIC శాఖ, పంచాయతీ శాఖ, మోటార్ వెహికిల్ శాఖ , 108 సర్వీస్ శాఖ మొదలగు శాఖ ల అధికారులతో సమన్వయంతో క్షుణ్ణంగా పర్యవేక్షణ చేశారు.నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పీ.ఎస్ కలెక్టర్ వెంట ఉన్నారు.ప్రజల ప్రాణ రక్షణ కోసం ట్రాఫిక్ నియంత్రణ చర్యలను మరింత బలోపేతం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ దిగువ విధముగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.వర్షం కారణంగా రోడ్డులో ఎక్కువగా గుంతలు ఏర్పడడం వలన ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయని వాటి మరమ్మత్తులు త్వరగా చేయాలని అన్నారు.
ఎన్ హెచ్ 63 పరిదిలో ఉన్నటువంటి దుకాణాలు, అడ్వటైజ్మెంట్లు బోర్డ్స్, విగ్రహాలు వెనుకకు జరిపించాలని తెలిపారు.
గ్రామాలలో పాదాచార్లు దాటుటకు జీబ్రా క్రాసింగ్ లైన్లు ఏర్పాటు చేయాలని తెలిపారు.కొన్నిచోట్ల జంక్షన్లు మూసి వేయడానికి బారికేడ్లు ఏర్పాటు చేయాలని అన్నారు.
మూల మలుపుల రోడ్డులో రోడ్డులో విశాలముగా కనపడే విధముగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై ఆర్మూర్ పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాదం సంఘటన దృశ్యాన్ని తిలకించడం జరిగింది.రిఫ్లెక్షన్ రేడియం స్టిక్కర్లను అవసరం గల చోట్ల ఏర్పాటు చేయాలన్నారు.అప్రోచింగ్ రోడ్ల వద్ద అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేశారు.జాతీయ రహదారి ని కలిపేటటువంటి అన్ని రకాల రోడ్లకు స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని సూచించారు.
వేగ నియంత్రణ పరికరాలను ఏర్పాటు చేయాలన్నారు.
బ్లెoకర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కొన్ని గ్రామాలలో గ్రామ ప్రజల నిర్ణయం మేరకు వారి సూచనలను కూడా తీసుకొని ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్ణయించి పోలీసులు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ప్రజల కూడా సహకరించాలని తెలియజేశారు. ప్రజలు రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్బంగా NH పెర్కిట్ EE ఎ. మలారెడ్డి , ప్రాజెక్టు డైరెక్టర్ మంచిర్యాల అజయ్ , RTA అధికారి ఉమా మహేశ్వర్ రావ్, R&B AE సతీష్, జిల్లా పంచాయతీ రాజ్ కార్యాలయం సిబ్బంది రామకృష్ణ, ట్రాఫిక్ ACP మస్తాన్ అలీ , ఆర్మూర్ ACP వెంకటేశ్వర్ రెడ్డి, బోధన్ ACP శ్రీనివాస్, I RAD మేనేజర్ వర్షా, 108 EMRI సర్వీసెస్ రామలింగేశ్వర రెడ్డి, అర్ముర్ మున్సిపల్ కమీషనర్ రాజు , పోలీస్ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



