Thursday, February 12, 2026

సైబర్ క్రైమ్ బాధితుడికి డబ్బు వాపస్

కోటగిరి ఆగస్టు 13 ద్రోణ

సైబర్ క్రైమ్ లో డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తికి కోటగిరి పోలీసులు డబ్బులు తిరిగి ఇప్పించడం జరిగింది.
కేసు యొక్క వివరాలు మార్చ్ 12వ తేదీ 2025 రోజున సుద్దులం తండా గ్రామానికి చెందిన దేవాసోత్ యోగేష్ అనే వ్యక్తికి అనుమానాస్పద లింక్ మెసేజ్ రాగా అట్టి మెసేజ్ ను అతను ఓపెన్ చేశాడు. దానివలన అతని యొక్క sim swap చేసి అతనికి వచ్చే మెసేజ్లు వేరే నెంబర్ కు వెళ్లేలా చేసి అతని బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఇట్టి విషయమే ఫిర్యాది యోగేష్ కోటగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా అతనికి 2112/- రూపాయలు తిరిగి ఇప్పించడం జరిగింది.
ప్రజలు అందరూ వారికి వచ్చే అనుమానస్పద లింకులు ఓపెన్ చేయవద్దని మరియు కొత్త నెంబర్ నుండి వచ్చే అనుమానాస్పద అప్లికేషన్లు ఇన్స్టాల్ చేసుకోవద్దని, ఏదైనా జరిగి డబ్బులు పోగొట్టుకున్నట్లయితే వెంటనే 1930 కి కాల్ చేసి గాని లేదా సైబర్ క్రైమ్ పోర్టల్ లో గాని ఫిర్యాదు చేయాలని కోటగిరి ఎస్సై సునీల్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular