Thursday, February 12, 2026

ఎమ్మెల్యే మదన్ కృషి ఎల్లారెడ్డి ప్రజల బస్ డిపో కల

కామారెడ్డి ఆగస్టు 11 ద్రోణ

ఎల్లారెడ్డిలో బస్ డిపో ఏర్పాటు కోసం సీఎం రేవంత్ రెడ్డి , రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలిసి ఎమ్మెల్యే మదన్ మోహన్ వినతిపత్రం అందజేశారు.
ఇటీవల 5 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త బస్ స్టాండ్‌ను నిర్మించి ప్రజల వినియోగానికి అందించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ , నియోజకవర్గంలో ప్రజా రవాణా సౌకర్యాలను విస్తరించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలిశారు. ఈ సందర్భంగా బస్సుల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి వెంటనే స్పందించి, బాన్సువాడ మరియు కామారెడ్డి రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసి, ఎల్లారెడ్డికి 10 అదనపు కొత్త బస్సులను కేటాయించారు. ఎమ్మెల్యే కృషితో నియోజకవర్గానికి 10 కొత్త బస్సులు రానున్నాయి.
మూడు దశాబ్దాల క్రితం డిపో నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో బస్ డిపో ఏర్పాటు ఎల్లారెడ్డి ప్రజల ఎన్నో ఏళ్ల కల. అవసరమైన అన్ని అనుమతులు సిద్ధంగా ఉండగా, సోమవారం సీఎం రేవంత్ రెడ్డి మరియు మంత్రి పొన్నం ప్రభాకర్ కి వినతిపత్రం అందజేయగా, వారు సానుకూలంగా స్పందించారు. తెలంగాణ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎండి కి ఎల్లారెడ్డిలో బస్ డిపో నిర్మాణంపై అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular