Thursday, February 12, 2026

ఎన్ హెచ్ 63 రహదారిలో బ్లాక్ స్పాట్స్ పర్యవేక్షణ

జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ కమిషనర్

మొత్తం 26 స్పాట్లను గుర్తించిన అధికారులు

బ్లాక్ స్పాట్లను స్వయంగా గుర్తించి ప్రమాదకర ప్రాంతాలను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ మరియు కమిషనర్

నిజామాబాద్ ఆగస్టు 12 ద్రోణ:-

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి అట్టి రోడ్డు ప్రమాదాలను నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తల కోసం నేడు పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎన్హెచ్63. నిజామాబాద్ నుండి కమ్మర్ పల్లి వరకు మరియు నిజామాబాదు నుండి బోధన్ వరకు గల 77 కిలోమీటర్ల పరిధిలో గల రోడ్డును పోలీసు శాఖ ఆర్ అండ్ బి శాఖ ఎన్ఐసీ శాఖ పంచాయతీ శాఖ మోటార్ వెహికల్ శాఖ 108 సర్వీస్ శాఖ మొదలగు అధికారులతో సమన్వయంతో క్షుణ్ణంగా పర్యవేక్షణ చేయడం జరిగిందని తెలిపారు.

ఈ పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఐఏఎస్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలను మరింత బలోపేతం చేయాలని సంబంధిత అధికారుల ఆదేశాలు జారీ చేశారు. వర్షాల కారణంగా రోడ్లు ఎక్కువగా గుంతలు ఏర్పడడం వల్లన ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని వాటిలో త్వరగా చేపట్టాలని ఎన్ హెచ్ 63 పరిధిలో ఉన్నటువంటి దుకాణాలు, అడ్వ ట్తె జ్మెంట్లు బోర్డ్ లను, విగ్రహాలను వెనుకకు జరపాలని గ్రామాలలో పాదచారులు దాటుటకు జీబ్రా క్రాసింగ్ లైన్లు ఏర్పాటు చేయాలని కొన్ని చోట్ల జంక్షన్లు మూసివేయాలని బ్రాడ్ గేట్లు ఏర్పాటు చేయాలని మూల మలుపుల రోడ్లు విశాలంగా కనపడే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.

ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై ప్రత్యేక ఏర్పాట్లు చేసిన రోడ్డు ప్రమాద సంఘటన దృశ్యానికి తిలకిస్తున్నాయి. రిఫ్లెక్షన్ రేడియం స్టిక్కర్లను అవసరమైన చోట్ల ఏర్పాటు చేయాలని అప్రోచింగ్ రోడ్ల వద్ద అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జాతీయ రహదారి ని కలిపేటటువంటి అన్ని రకాల రోడ్లకు స్పీడ్ బ్రేకర్లను ఇరువైపులా ఏర్పాటు చేయాలని అతివేగ నియంత్రణ పరికరాలను ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలని అక్కడి అధికారులకు సూచించారు. కొన్ని గ్రామాలలో గ్రామ ప్రజలు నిర్ణయం మేరకు సూచనలు కూడా వారు తీసుకోవడం జరిగిందని అవగాహన కార్యక్రమం పోలీసులు నిర్వహించి చేపట్టినట్టు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా సహకరించి రోడ్డు భద్రతను పాటించాలని నిబంధనలకు విరుద్ధంగా ఉండకూడదని జాగ్రత్తగా ప్రయాణించే విధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎన్ హెచ్ పెర్కిట్ ఈ ఈ ఎ మల్ల గౌడ్, ప్రాజెక్టు డైరెక్టర్ మంచిర్యాల అజయ్, ఆర్టిఏ అధికారి ఉమామహేశ్వర్ రావు, ఆర్ అండ్ బి ఏ ఈ సతీష్, జిల్లా పంచాయతీ రాజ్ కార్యాలయ సిబ్బంది రామకృష్ణ, ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ, ఆర్మూర్ ఏసిపి వెంకటేశ్వర రెడ్డి, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు మరియు సిఐలు ఎస్సైలు సంబంధిత తదితర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular