Thursday, February 12, 2026

పులివెందుల ప్రజలకు ఒకరోజు ముందే స్వాతంత్రం

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఫలితాలు ఇలాగే ఉంటాయి.

మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి,
ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

పుట్టపర్తి ఆగస్టు 14 ద్రోణ

ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం ఒక్క రోజు ముందుగానే పులివెందుల ప్రాంత ప్రజలకు పూర్తి స్వాతంత్రం లభించిందని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి,పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి లు పేర్కొన్నారు. పులివెందుల,ఒంటిమిట్ట జడ్పిటిసి ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులు మా రెడ్డి లతా రెడ్డి ముద్దుకృష్ణారెడ్డి గెలుపొందడం పై పులివెందుల ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వారు ఈ విధంగా స్పందించారు. పులివెందుల జడ్పిటిసి ఉప ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందన్నారు. 40 ఏళ్ల తర్వాత పులివెందుల ప్రజలు తమ ఓటు హక్కు పొందే విధంగా పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రం ఇప్పుడు వచ్చిందన్నారు. స్వేచ్ఛగా ఎన్నికల జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయో ఈ ఫలితాల ద్వారా నిరూపణ అయిందన్నారు. రాష్ట్రంలో అరాచకాలు, దౌర్జన్యాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వం కళ్లెం వేయడం వల్లే ఈరోజు పులివెందుల ప్రాంతంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల కొనసాగాయని రాష్ట్ర ప్రజల్లో నిరూపణ అయిందన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధిని చూసి పులివెందుల ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయని చెప్పడానికి అందుకు ఈ ఎన్నికల్లో 11 మంది అభ్యర్థులుగా నామినేషన్లు వేశారని గుర్తు చేశారు. వైసిపి ప్రభుత్వం లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నో దౌర్జన్యాలు ,అక్రమాలు భయభ్రాంతులకు గురిచేస్తూ టిడిపి అభ్యర్థులను స్థానిక ఎన్నికల్లో పోటీ చేయనీకుండా ఆ ఎన్నికల్లో అసలు టిడిపి పోటీ లేకుండా కేవలం వైసిపి అభ్యర్థులే పోటీలో ఉండేలా చేసి రిగ్గింగ్ చేసుకున్న విషయాలను గుర్తు చేసుకోవాలని వైసిపి నేతలకు సూచించారు. ఈరోజు కూటమి ప్రభుత్వం పులివెందుల నియోజకవర్గ ఓటర్లకు పూర్తి స్వేచ్ఛను కల్పించి ప్రజాస్వామ్యబద్ధంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా స్వేచ్ఛ వాతావరణం లో ఎన్నికలు నిర్వహించిన కూటమి ప్రభుత్వానికి , రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు అక్కడ పోలీస్ ,జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి పులివెందుల ఓటర్లకు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పులివెందుల ఒంటిమిట్టలో టిడిపి అభ్యర్థులు మా రెడ్డి లతా రెడ్డి ముద్దు కృష్ణారెడ్డి విజయానికి కృషిచేసిన కూటమి పార్టీల కార్యకర్తలకు , ఓటు వేసి గెలిపించిన ఓటర్లకు మాజీమంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular