బోధన్ బిజెపి పిలుపు
బోధన్ ఆగస్టు 14 ద్రోణ
ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరించాలని బోధన్ బిజెపి పిలుపునిచ్చింది.
భారతదేశ ప్రధాని నరేంద్ర మోది పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం లో భాగంగా బోధన్ మండల అధ్యక్షులు సిర్ప సుదర్శన్ ఆధ్వర్యంలో గురువారం బోధన్ మండలం అమ్ధాపూర్ గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు జాతీయ జండా లు పంపిణి చేశారు. మాట్లాడుతు విద్యార్థులు దేశం పట్ల ప్రేమ, భక్తి కలిగి ఉండాలని, జాతి పట్ల గౌరవం పెంపోందించుకోవాలని,మువ్వన్నెల జండా అంటే ఓ ఉద్వేగం, ఓ స్ఫూర్తి అని,ప్రపంచం లోనే శక్తివంతమైన జండా మన తెలుగువాడు రూపొందించడం మనకు గర్వ కారణం అని, ప్రతి ఇంట మన జాతీయ ఎగరాలని అన్నారు.ప్రధాని
మోది నాయకత్వం లో ప్రపంచంలో నే అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమం లో విద్యార్థులు,శక్తి కేంద్రం ఇంఛార్జ్ లు, బూత్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు,ప్రజలు, యువకులు పాల్గొన్నారు.

