ఎమ్మెల్యే పోచారం పోచారం
బోధన్ ఆగస్టు 14 ద్రోణ
ఈ ప్రాంతంలో ఎన్నో సామాజిక మార్పులు తీసుకురావడానికి హేమలతా లవణం దంపతుల చేసిన అవిరాళ కృషిని ఎన్నటికీ మరువలేమని వ్యవసాయ శాఖ సలహాదారులు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ప్రముఖ సంఘ సంస్కర్తలు హేమలత లవణం దంపతుల విగ్రహావిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నిజామాబాద్ జిల్లా బాన్సునాడ నియోజకవర్గం రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలో సంస్కార్ ప్రకృతి ఆశ్రమంలో సంస్కార్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థకులు, ప్రముఖ సంఘ సంస్కర్తలు, జోగిని వ్యవస్థ నిర్మూలన కొరకు పోరాటం చేసిన హేమలత లవణం దంపతుల విగ్రహాలను గురువారం పోచారం చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి ఆశ్రమ వ్యవస్థాపకులు మంతెన సత్యనారాయణ, ఆగ్రో ఇంట్రెస్ట్ చైర్మన్ కాసుల బాలరాజు, పెంట కూర్దు సొసైటీ చైర్మన్, హస్తకళల మాజీ చైర్మన్ అమర్నాథ్ బాబు, అరుణ్ కుమార్, పలువురు ప్రజాప్రతినిధులు, సామాజిక సేవ కార్యకర్తలు పాల్గొన్నారు
పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్థులు, సంస్కార్ ఆశ్రమం సిబ్బంది.








