Thursday, February 12, 2026

విద్యార్థుల్లో దేశభక్తిని మరింత పెంపొందించాలి

జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు

జుక్కల్ ఆగస్టు 15 ద్రోణ

పాఠశాలలో విద్యార్థులకు విద్యా, క్రమశిక్షణతో పాటు దేశభక్తిని మరింత పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు స్పష్టం చేశారు.79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మద్నూర్ మండలం పెద్ద ఎక్లారా గ్రామంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఎమ్మెల్యే కి పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జాతీయ జెండా ఆవిష్కరించారు.
అనంతరం వారు మాట్లాడుతూ
స్వాతంత్ర్య సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.వారి ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరం పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
విద్యార్థులందరూ కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకొని దేశ ప్రగతిలో పాలుపంచుకోవాలని అన్నారు.ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువు, క్రమశిక్షణతో పాటు వారిలో దేశభక్తి భావాలు పెంపొందించే విధంగా కృషి చేయాలని, భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular