Thursday, February 12, 2026

సహకార రంగ చైర్మన్ల సంబరాలు

హర్షం వ్యక్తం చేసిన బ్యాంక్ చైర్మన్

నిజామాబాద్ ఆగస్టు 15 ద్రోణ

సహకార రంగాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది. సహకార సంఘాల పాలకవర్గాల, మరియు జిల్లా సహకార బ్యాంక్ పాలకవర్గాల పదవీకాలం గడువును మరో ఆరు నెలలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే పాలకవర్గాల గడువు ముగిసి ఆరు నెలలు గడుస్తుంది. ఎన్నికలు పెట్టేందుకు ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడంతో సహకార రంగ ఎన్నికలను మరోసారి వాయిదా వేసింది. గతంలో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు విడుదల చేయగా, ఆ గడువు కూడా ముగియడానికి దగ్గర రావడంతో మరోసారి పాలకవర్గాల గడువును ఆరు నెలలు పెంచుతూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. తమపై ప్రభుత్వం, సహకార సంఘాల అధ్యక్షులు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సహకార రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షులు రమేష్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం సహకార సంఘాల పదవీ కాలాన్ని పొడిగించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సహకార బ్యాంక్ ఆవరణలో సహకారంగ ప్రజాప్రతినిధులు సంబరాలు జరుపుకున్నారు. ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కేంద్రంలో సహకార,
సొసైటీ చైర్మన్లు మరియు బ్యాంకు చైర్మన్ పాలకవర్గాల పదవీ కాలాన్ని ఆరు నెలలు పొడిగించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , వ్యవసాయ శాఖ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఇంచార్జ్ మంత్రి సీతక్క , శాసనసభ్యులు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మాజీ స్పీకర్ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి , ప్రభుత్వ సలహాదారు షబ్బీర్, శాసన సభ్యులు భూపతి రెడ్డి , శాసన సభ్యులు మదన్ మోహన్ , శాసన సభ్యులు లక్ష్మీకాంత్ రావు , పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కర్ చిత్రపటములకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్షులు కుంట రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యక్షులు డైరెక్టర్లు మరియు ఉభయ జిల్లాల సొసైటీ అధ్యక్షులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పాలాభిషేకం కావించిన కొత్తపల్లి సొసైటీ చైర్మన్ డాక్టర్ వెనిగళ్ళ సునీల్ కుమార్ చౌదరి, కల్దుర్కి సొసైటీ చైర్మన్ శరత్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular