Thursday, February 12, 2026

నిఘా వ్యవస్థలు బలోపేతమైతేనే నేరాలు తగ్గుతాయి

ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్

అమరావతి ఆగస్టు 15 ద్రోణ

సమాజంలో నిఘా వ్యవస్థలు బలోపేతమైతేనే నేరాలు తగ్గి ప్రజలకు మేలు జరుగుతుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా పోలీసుల సంఖ్య పెరగలేదన్నారు. అందువల్ల ప్రభుత్వ, ప్రైవేట్ నిఘా, రక్షణ వ్యవస్థల ఆవశ్యకత ఎంతో ఉందన్నారు.. గుంటూరు లోని కాటన్ అసోసియేషన్ హాల్లో గురువారం సత్య ఇన్వెస్టిగేషన్ సెక్యూరిటీ సర్వీసెస్ (ఎస్ ఐ ఎస్ ఎస్) పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి మాజీ ప్రిన్సిపల్ ఎలమంచిలి శ్రీధర్ అధ్యక్షత వహించారు. ఆలపాటి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్ ఐ ఎస్ ఎస్ తన సేవలను విస్తృత పరిచి ప్రజల మన్నలను పొందారని కితాబునిచ్చారు. వెబ్ సైట్ ను ప్రారంభించిన రేరా మాజీ చైర్మన్ డాక్టర్ ఎలమాటి రామనాథం మాట్లాడుతూ ఎస్ ఐ ఎస్ ఎస్ నాణ్యమైన సేవలను అందిస్తూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్నారని చెప్పారు. విశ్రాంత ఏఎస్పి సత్యనారాయణ పోలీస్ శాఖలో తన అనుభవాలను సంస్థపై కేంద్రీకరించడం వలన మూడు రాష్ట్రాల్లో కార్పొరేట్, అంతర్జాతీయ సంస్థలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసి రక్షణ వ్యవస్థను బలోపేతం చేశారని ప్రశంసించారు. ఆడిటర్ వి భార్గవి మాట్లాడుతూ ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలు యువతకు అండగా నిలుస్తున్నాయన్నారు. ఎస్ ఐ ఎస్ ఎస్ సంస్థ సలహాదారులు,విశ్రాంత ఐజి, రవిచంద్ర మాట్లాడుతూ సమాజంలో ప్రైవేటు నిఘా వ్యవస్థల అవసరం ఉందన్నారు. దేశస్థాయిలో పెరిగిన జనాభా కనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిఘా విభాగాలల్లో ఉద్యోగులను పెంచలేదన్నారు. అందువలన ప్రైవేటు రక్షణ, నిఘా వ్యవస్థల వ్యవస్థల ఆవశ్యకత ఉందని ఆయన అన్నారు.ఎస్ ఐ ఎస్ ఎస్ ఎం డి కాళహస్తి సత్యనారాయణ మాట్లాడుతూ గత 15 ఏళ్ల నుంచి ప్రముఖ సంస్థలకు నాణ్యమైన సేవలు అందించమన్నారు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వెబ్సైటు, పవర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, బ్రోచర్ల ద్వారా తమ సేవలను విస్తృత పరుస్తామన్నారు. ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ చందు సాంబశివరావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఎస్ ఐ ఎస్ ఎస్ మెరుగైన సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.. ఈ సందర్భంగా ఎండి కాళహస్తి సత్యనారాయణ తమ సంస్థ అందించిన సేవలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎస్ ఐ ఎస్ ఎస్ బ్రోచర్లను అతిధులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత డిఎస్పీలు సుబ్బారెడ్డి, కె.వి నారాయణ, పోతురాజు, ఏపీ కాటన్ అసోసియేషన్ కార్యదర్శి కొర్రపాటి రామారావు, పెదనందిపాడు కళాశాల ప్రిన్సిపల్. డాక్టర్ రాఘవయ్య, మాజీ ఎంపీపీ నర్రా బాలకృష్ణ, పాతూరి శ్రీనివాసరావు, వాణిజ్య పనుల శాఖ విశ్రాంత డిప్యూటీ కమిషనర్ కోదండ రామయ్య, దివ్యభారతి, మేరిగ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
సంస్థ లో సుదీర్ఘకాలం పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన రామచంద్రరావు, డ్రైవర్ సుభానీలను శాలువా తో సత్కరించి నగదును అందజేశారు. సంస్థలో మెరుగైన సేవలు అందించిన జి ఉమామహేశ్వరరావు, పి మల్లికార్జునరావు, ఎస్ వెంకట శివరావు లకు యం ది కాళహస్తి మెమొంటలను అందించి శాలువ తో సత్కరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular