ఎమ్మెల్యే పోచారం
బాన్సువాడ ఆగస్టు 16 ద్రోణ
అనారోగ్యానికి గురై వైద్యం కొరకు అప్పుల పాలై ఇబ్బందులు అవుతున్న బాధితులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆపన్న హస్తం అందిస్తుందని వ్యవసాయ శాఖ ప్రభుత్వ సలహాదారులు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎంతో మందికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందన్నారు.బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో బాన్సువాడ నియోజక వర్గంలోని 69 మంది ముఖ్యమంత్రి సహాయ నిది (CMRF) లబ్ధిదారులకు రూ 26,43,500/- ల చెక్కులను పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజక వర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట్ర అగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు.
పాల్గొన్న బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం శ్యామల వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా బాన్సువాడ నియోజక వర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు పలువురు పాల్గొన్నారు.బాన్సువాడ గ్రామీణ మండలం 23 మంది CMRF లబ్ధిదారులకు రూ 7,11,000/-
బాన్సువాడ మున్సిపాలిటీ 10 మంది CMRF లబ్ధిదారులకు రూ 3,24,000/-
బీర్కూర్ మండలం 05 CMRF లబ్ధిదారులకు రూ 1,56,000/-
నసురుల్లబాద్ మండలం 10 మంది లబ్దిదారులకు రూ 3,39,000/-
మొస్రా మండలం 03 లబ్దిదారునికి రూ 72,000/-
చందూర్ మండలం 04 గురు లబ్దిదారులకు రూ 1,22,500/-
వర్ని మండలం 05 మంది లబ్దిదారులకు రూ 6,25,000/-
రుద్రుర్ మండలం 04 లబ్దిదారునికి రూ 1,44,000/-
కోటగిరి మండలం 02 మంది లబ్దిదారులకు రూ 46,000/-
పోతంగల్ మండలం 03 మంది లబ్ధిదారులకు రూ 1,04,000/-
మొత్తం నియోజక వర్గం లో 69 మంది CMRF లబ్ధిదారులకు రూ 26,43,500/- చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.










