Thursday, February 12, 2026

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సులువుతరం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం ఎంతో అభినందనీయమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యక్తం చేశారు. ప్రయాణ సమయంలో మహిళలకు ఇబ్బందులు దూరం చేసేందుకే ప్రభుత్వం మరిన్ని అదనపు బస్సులను ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు.బాన్సువాడ డిపోకు కెటాయించిన రెండు కొత్త ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసులను నిజామాబాద్ నుండి జహీరాబాద్(వయా బోధన్, బాన్సువాడ, నిజాంసాగర్ )మరియు బాన్సువాడ నుండి నారాయణఖేడ్(వయా పిట్లం, నిజాంపేట్) సర్వీసు బస్సులను శనివారం డిపో వద్ద జెండా ఊపి పోచారం ప్రారంభించారు.
తెలంగాణలో మహాలక్ష్మీ పథకం అమల్లోకి తెచ్చి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో మహిళలు, విద్యార్థినుల ప్రయాణాలు బాగా పెరిగాయి.
మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీని తగ్గించేందుకు అందుబాటులో కొత్త బస్సులు కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ డిపో మేనేజర్ సరిత దేవి, ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular