ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ బోధన్ రానున్నారని, ఈ భారీ బహిరంగ సభకు ఈ ప్రాంత ప్రజలు వేలాదిమంది తరలిరావాలని పోతంగల్ మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షులు ఎర్రోళ్ల యాదవరావు పిలుపునిచ్చారు. బోధన్ లో జరిగే భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు.
శనివారం వికలాంగుల, పెన్షన్ 4000 నుంచి 6000 పెంచాలని వితంతువులకు, చేయూత పెన్షన్ దారులకు 2000 నుంచి 4000 పెంచాలని కండరాల క్షీణత వారికి 15000 ఇవ్వాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్, చేస్తూ మహా గర్జన సన్నాహక సదస్సు బోధన్ పట్టణంలో అయోష గార్డెన్ నందు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మహా గర్జన. సన్నాక సదస్సుకు ముఖ్య అతిధులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ విచ్చేయుచున్నారు . బోధన్ చుట్టుపక్కల మండలాల వారు వేలాదిగా వికలాంగులు పించన్ దారులు తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు విజ్ఞప్తి చేశారు. పోతంగల్ ఎమ్మార్పీఎస్, మండల అధ్యక్షుడు ఎర్రోళ్ల యాదవ రావు ఆధ్వర్యంలో వందలాదిమంది తరలి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
చలో బోధన్
RELATED ARTICLES
