విజయవంతం చేయాలని జిల్లా ఎమ్మార్పీఎస్ సహాయ కార్యదర్శి పిలుపు
బోధన్ ఆగస్టు 22 ద్రోణ
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఈనెల 23 న బోధన్ రానున్నట్లు ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సోంపూర్ పోచీరం ఒక ప్రకటనలో తెలిపారు. బోధన్ పట్టణ కేంద్రంలో దివ్యాంగుల వికలాంగులు వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు గౌడ సంఘం కార్మికులు పెన్షన్ దారుల పెంపు డిమాండ్ తో పించన్ దార్ల భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వివరించారు. పెన్షన్ పెంపు కొరకై మరియు ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున జన సమీకరణ జరిపి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సభకు ముఖ్య అతిథి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ బోధన్ రాకను ప్రతి ఒక్కరూ స్వాగతించడంతోపాటు, గర్వపడాలన్నారు.నేడు ఎంతోమంది అభాగ్యులు వికలాంగులు పెన్షన్ పొందుతున్నారంటే అది మందకృష్ణ పుణ్యమే అన్నారు. ఎన్నో ఏళ్ల పాటు ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. దేశంలోనే ఉత్తమ సేవ అవార్డును కూడా అందుకున్న విషయాన్ని గుర్తు చేశారు. బాన్సువాడ నియోజకవర్గ ఎంఆర్పిఎస్ నాయకులు ప్రతి ఒక్కరు ఈ సభను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని పోచీరం పిలుపునిచ్చారు.
