దేశాభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం
వరంగల్ ఎంపీ కావ్య
వరంగల్ ఆగస్టు 23 ద్రోణ
దేశానికి రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అయితే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. హనుమకొండ డీసీసీ భవన్‌లో జరిగిన తెలంగాణ పీసీసీ జనహిత పాదయాత్ర సమీక్షా సమావేశంలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ధనసరి సీతక్క, ఉమ్మడి వరంగల్ జిల్లా శాసనసభ్యులతో కలిసి వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ బీజేపీ దేశాన్ని దోచుకుంటుందని అన్నారు. ఓటు హక్కును లాక్కొని దొంగ దారిన మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తోంది అని ఎంపీ విమర్శించారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ 25.08.2025 రోజున సాయంత్రం 04.00 గంటలకు,
వర్ధన్నపేట మండలం, ఇల్లంద మార్కెట్ నుండి వర్ధన్నపేట టౌన్ అంబేద్కర్ సెంటర్ వరకు పాదయాత్ర చేయనున్నారని తెలియజేశారు. ఈ పాదయాత్రకు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకుడు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరంగల్ నగర అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఇప్పటికే 6 వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించడంతో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. వరంగల్‌ను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. రానున్న 2029 ఎన్నికల్లో రాహుల్ గాంధీ ని ప్రధానిని చేయడం కోసం ప్రతి ఒక్క కార్యకర్త ఒక్కో సైనికుల్లా కృషి చేయాలని ఎంపీ డాక్టర్ కడియం కావ్య పిలుపునిచ్చారు.




