పలు అక్రమాలను వెలుగులోకి తీసిన సిపి
నిజామాబాద్ ప్రతినిధి ఆగస్టు 23 ద్రోణ
నిజామాబాద్ *పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఆదేశాల మేరకు నిజామాబాద్, ఆర్మూర్ , బోధన్ డివిజన్ పోలీసులు అక్రమ వడ్డీ వ్యాపారులపై శనివారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు.
ఎలాంటి అనుమతులు లేకుండా, రిజిస్ట్రేషన్ సైతం లేకుండా అనేకమంది అక్రమంగా ఫైనాన్స్ లు ఏర్పడి, ఇలా అక్రమ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నారని ఫిర్యాదుల మేరకు ఈ దాడులు జరిపారు. సామన్య పేద కుటుంబాలకు చెందిన వారి అవసరాలను ఆసరాగా చేసుకొని , ఫైనాన్స్ పేరుతో వారి వద్ద నుండి అధిక వడ్డీలు పసూలు చేస్తూ వీరిని ఆర్ధికంగా మరింత ఇబ్బందులకు గురి చేస్తున, ఈ అక్రమ వడ్డీ వ్యాపారులపై కఠినచర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.ఈ సందర్భంగా లభ్యమైన పూర్తి వివరాలు ఈ దిగువ విధంగా గలవు.
1) *చెక్కులు* నిజామాబాదులో
137, వాటి విలువ 10,14,11,370/- ఆర్మూర్ లో =62, వాటి విలువ 30,36,000/-
బోధనలో = 00
2).ప్రామిసరీ నోట్స్ నిజామాబాదులో= 170, వాటి విలువ=7,10,73,870/- ఆర్మూర్ లో =324, వాటి విలువ 4,97,10,000/-
బోధన్ లో= 00
3).బాండ్ పేపర్స్ నిజామాబాదులో = 00
ఆర్మూర్ లో =49, వాటి విలువ=1,85,30,500 /-
బోధన్ లో = 00
4).ల్యాండ్ డాక్యుమెంట్స్
నిజామాబాదులో=99
ఆర్మూర్ లో=05
బోధన్ లో = 00
5) నిజామాబాదులో నగదు మొత్తం రూపాయలు= 1,21,92,750/-
