Thursday, February 12, 2026

వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది

అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క సూచన

కామారెడ్డి ఆగస్ట్ 28 ద్రోణ

వరద బాధితులను తమ ప్రభుత్వం ఆదుకొని తీరుతుందని ప్రజలు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క అన్నారు.
కామారెడ్డిలోని జి ఆర్ కాలనీలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.గత ప్రభుత్వం వరద సందర్భాల్లో ప్రజలను గాలిలో వదిలి వేసేదని తమ ప్రభుత్వం ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలక్కుండా చూస్తుందన్నారు. గతంలో ఎన్నోసార్లు వరద ప్రభావంతో పంటలు కొట్టుకుపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వని పార్టీల నాయకులు ప్రగల్బాలు పలకడం సిగ్గుచేటు అన్నారు. గత ఏడాది పంటలు నష్టపోయిన రైతులకు తమ ప్రభుత్వం నష్టపరిహారం రైతులకు చెల్లించిందని అన్నారు. మంత్రి వెంట రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ , ఎంపీ సురేష్ శెట్కార్ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. వర్షాల కారణంగా రహదారులు కోతకు గురైన పరిస్థితులను, లోతట్టుప్రాంతాలను మంత్రి స్వయంగా పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను ఆరా తీశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular