Thursday, February 12, 2026

వరద బాధితులకు లయన్స్ క్లబ్ రెడ్ క్రాస్ ఉదారత

రెడ్ క్రాస్ బృందాన్ని అభినందిస్తున్న ప్రజలు.

బోధన్ ఆగస్టు 28 ద్రోణ

బోధన్ ప్రాంత ప్రజలు ప్రకృతి వైపరీత్యానికి విలవిలాడుతున్న సందర్భంలోనూ, బోధన్ లయన్స్ క్లబ్ తాము ఉన్నామంటూ ముందుకు వస్తూ బాధితులకు ప్రతిసారి తమ వంతు సహాయ సహకారాలను అందిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలే కాకుండా ప్రజలకు ఏ ఇబ్బందులు ఉన్న తాము అండగా నిలబడతామంటూ లయన్ ప్రతినిధులు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. లయన్ బృందానికి ఈ ప్రాంత ప్రజలు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. సేవే తమ లక్ష్యంగా భావిస్తూ రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిరుపేద అభాగ్యులు నీడను కోల్పోవడం, ఇంటి కప్పులు సరిగా లేక వర్షం నీరు ఇంటిలో చేరడంతో పేదలు ఎంతోమంది పడరాన్ని పాట్లు పడుతూ ఉన్నారు. వారికి అండగా బోధన్ లయన్స్ క్లబ్ బృందం తో పాటు రెడ్ క్రాస్ సంస్థ పేదలకు వెన్నుదన్నుగా నిలిచారు. ప్రపంచంలో ప్రతి వస్తువును డబ్బుతో కొనుగోలు చేయవచ్చు, కానీ రక్తాన్ని మాత్రం ఎంత డబ్బు చెల్లించిన కొనుగోలు చేయలేము. రెడ్ క్రాస్ సొసైటీని స్థాపించి ఎన్నో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి రక్తాన్ని సేకరించి, ప్రతి జిల్లా కేంద్రంలో రక్తాన్ని నిల్వ ఉంచి అటువంటి రక్తాన్ని ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్న వారికి రక్తాన్ని అందించి లక్షలాది ప్రాణాలను కాపాడుతున్న రెడ్ క్రాస్ సొసైటీ బృందం అండగా ఉంటామంటూ పేదలకు పట్టాల పంపిణీ చేశారు. రెడ్ క్రాస్ సేవలను ప్రజలు అభినందిస్తున్నారు.

భారివర్షం కారణంగా బోధన్ ప్రాంతం అస్తవ్యస్థంగా మారింది. నర్సాపూర్ లోని ఇండ్లలో వర్షపు నీరు ప్రవేశించింది,నర్సాపూర్ ప్రజలు అసహనం మరియు దిగులుతో బాధపడుతూ కష్టాలు ఎదుర్కొంటున్న విషయాన్ని తెలుసుకున్నారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లను రక్షించేందుకు రెడ్ క్రాస్ సొసైటీ మరియు లయన్స్ క్లబ్ ప్రతినిధులు ముందుకొచ్చారు. 10 ఇళ్ళపై పట్టాలు కప్పారు.బోధన్ పట్టణ పరిస్థితులపై మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ మాట్లాడారు ,రెడ్ క్రాస్ సొసైటీ బోధన్ డివిజన్ అధ్యక్షులు బసవేశ్వర రావు మాట్లాడుతూ నర్సాపూర్ ప్రాంత ప్రజలు అతి భారీ వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యలకు పది సంవత్సరాలు పనిచేసే తైవాన్ పట్టాలు పంపిణీ చేశామన్నారు. ప్రజలకు ప్రకృతి వైపరీత్యాలతో, పేదలు అనారోగ్యంతో ఇబ్బందులు పడే సందర్భాలు ఎదురైతే వారిని తమ వంతు సహాయం చేసి ఆదుకొని తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ టౌన్ మరియు మండల రెడ్ క్రాస్ అధ్యక్షులు కొడాలి కిషోర్, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీనివాస్,బోధన్ లయన్స్ అధ్యక్షులు నాగేశ్వరరావు,స్థానికులు సాయికృష్ణ నర్సాపూర్ గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular