Thursday, February 12, 2026

వరద బాధితులకు నిత్యవసరాలు అందిస్తాం

బాధిత కుటుంబాలకు
దుప్పట్లు అందించిన మాజీ ఎంపీ బేబీ పాటిల్

కామారెడ్డి ఆగస్టు 28 ద్రోణ

కామారెడ్డి జిల్లా పరిధిలోని జుక్కల్ నియోజకవర్గం మంజీరా పరివాహక ప్రాంత మంజీరా ముంపు బాధిత కుటుంబాల కు నిత్యవసరాలను అందిస్తానని, బాధిత కుటుంబాలకు దుప్పట్లను అందజేసిన తాజా మాజీ ఎంపీ బేబీ పాటిల్. జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని మద్నూర్ , డోoగ్లి మండలాల (సిర్పూర్ , థడి హిప్పర్గా , పెద్ద టాక్లీ , చిన్న టాక్లీ) గ్రామాలలో వరద నీరు చేరి ప్రజలు ఇబ్బంది పడుతుండగా NDRF , రెవెన్యూ , పోలీస్, ఫైర్ , పంచాయత్ బృందాలు వీరిని కాపాడి మద్నూర్ మండల్ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి బాధ కుటుంబాలను తరలించారు.
బాధిత కుటుంబాలను కలసిన మాజీ ఎంపీ బీబీ.పాటిల్ గారు ధైర్యం చెప్పి నిత్యవసర వస్తువులు అందిస్తానని చెప్పి వెంటనే దాదాపు 250 బాధితులకి దుప్పటులు అందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular